క్యాన్సర్ కి కళ్లెం వేసే టామటా

First Published 23, Dec 2017, 3:56 PM IST
Two tomatoes a day may keep cancer and lung disease at bay
Highlights
  • కేవలం రుచి మాత్రమే  కాదు.. ఆరోగ్యాన్ని కూడా టమాట ఇస్తుందంటున్నారు నిపుణులు.

మనం రోజూ తినే కూరగాయాల్లో టమాట ఒకటి. అన్ని కూరగాయలకు కాంబినేషన్ గా టమాటాను వాడుతుంటారు. టమాట వాడితే ఆ కూరకే రుచిని తెచ్చిపెడుతుంది. కేవలం రుచి మాత్రమే  కాదు.. ఆరోగ్యాన్ని కూడా టమాట ఇస్తుందంటున్నారు నిపుణులు. ఇది జీర్ణాశయ క్యాన్సర్‌ ఉప్పు, ఊపిరితిత్తుల సమస్యల తగ్గటానికీ తోడ్పడుతుందని ఇటలీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

టమోటా రసంలో ఉండే కణాలు జీర్ణాశయ గోడల్లో క్యాన్సర్‌ కణాలు వృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్‌ కణాలు ఇతర భాగాలకు వ్యాపించకుండా నిరోధించటంతో పాటు క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందటానికి తోడ్పడే ప్రోటీన్లను అడ్డుకుంటున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. ఇలా ఇది క్యాన్సర్‌ కణాలు మరణించేలా చేస్తుంది. అయితే టమోటాల్లోని లైకోపేన్‌ వంటి ఏదో ఒక రసాయనం ఉంటుందని.. దాని వల్లే ఇది సాధ్యమౌతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్‌ నివారణలో కొన్ని ప్రత్యేక పోషకాలను వినియోగించుకోవచ్చని, అలాగే సంప్రదాయ చికిత్సకు మద్దతుగా ఇలాంటి పద్ధతులు బాగా తోడ్పడగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని వివరిస్తున్నారు. అంతేకాదు.. ప్రతి రోజు రెండు టమాటాలు తింటే.. ఊపిరితిత్తుల సమస్యలకు రాకుండా ఉంటాయి.

loader