ఇండియాని నవ్వుల పాలు చేస్తున్న రెండువేల నోటు

two thousand note makes India a butt of a joke
Highlights

ప్రపంచమంతా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నపుడు ఇండియా రెండు వేల నోట్ ఎందుకు తెచ్చిందో ఎవరికీ అర్థం కావడం లేదు

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ఆఫీసర్లు కొంతమంది చైనా వెళ్లారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టండని అడగడానికి వెళ్లి చాలా మంది  చైనా అధికారులతో సమావేశమయ్యారు. అయితే, చైనా అధికారులు విస్తుపోయి వాకబు చేసిన విషయం ఏమిటో తెలుసా?

 

పెట్టుబడులు పెట్టేందుకు నిజంగా  అమరావతి అంతబాగుంటుందా అని కాదు... ఇండియా విడుదల చేసిన కొత్త భారీ నోటు రెండు వేల నోటు గురించి.

 

అంత పెద్ద నోటు ఏమి చేసుకుంటారని అని  వారు ప్రశ్నించారు.

 

 ప్రపంచంలో ఎక్కడా పెద్ద నోట్లు లేవు. మీకేందుకు అని అడిగారట. ఇండియా వాళ్ల లాజిక్ ఏమిటో కనుక్కునే ప్రయత్నం చేశారట.

 

వాళ్ల దేశంలో పెద్ద నోటు విలువ 100 యువాన్ రెన్మిన్ బిలే. పెద్ద నోట్లు ఎందుకు పనికిరావని ప్రపంచమంతా భావిస్తే మీరెందుకుఅచ్చేస్తున్నారని ఆశ్యర్యపోయారట. పెద్దనోట్లు  నల్లమహారాజుల కోసమే నని వారి అభిప్రాయం. కాబట్టి మన రెండు వేల నోటును కూడ ఎవరో పెద్దమనుషులకు, అయిదొందలు, వేయి నోట్లను రద్దు చేసినపుడు వచ్చే కష్టాల నుంచి కాపాడేందుకు ముద్రించారని అనుకోవాలి.

 

మనవాళ్లకు చైనా వాళ్లు ఇంకా చాలా విషయాలు చెప్పారట. రెండు వేల రుపాయల నోటు చాలా నష్టమని బల్ల గుద్దిచెప్పారట. రెండు వేల నోటు ఎందుకు ముద్రించాల్సి వచ్చిందో చెప్పండని అడిగారట.ఇంతవరకు కేంద్రమే సరయిన  వివరణ  ఇవ్వలేదు. మన వాళ్లదగ్గిర సమాధానమే లేదట.

 

కాక పోతే, అర్ఎస్ ఎస్ మేధావి  ఎస్ గురుమూర్తి మాత్రం తొందర్లో రెండు వేలు నోటును కూడా తీసేస్తారని చెప్పారు కాబట్టి,  ఇది కూడా టెంపరొరీయే అన్నారట.

 

అమెరికాలో డిసెంబర్ 18,1934 నుంచి జనవరి 9,1935 మధ్య లక్ష డాలర్ నోటు ముద్రించారు. అయితే, బజార్లోకి రాలేదు. కేవలం బ్యాంకుల మధ్య లావాదేవీలకే ఉద్దేశించారు. ప్రెశిడెంట్ వుడ్రోవిల్సన్ బొమ్మతో ఈ నోటు వచ్చింది. ఇతర పెద్దనోట్లు అంటే  $500,$1000; $5000; $10,000 లను  1946 లోనే నిలిపేశారు.

 

మనకు అత్యంత ఆదర్శవంతంగా కనిపించే సింగపూర్  లో మాత్రమే ప్రపంచంలోనే అత్యంత విలువయిన డాలర్ నోటు ఉండింది. మీకు తెలుసు కదా, సింగపూర్ ఆసియాలో ఉలిపికట్టె. మిగతా ఆసియా ఒకటి చెబితే, సింగపూర్ మరొకటి అంటుంది. వాళ్లు ఏకంగా $ 10,000 నోటు తీసుకువచ్చారు.

 

అయితే,  దాని వల్ల అనర్థాలు ఎక్కువగా ఉన్నాయని అక్టోబర్1,2014 నుంకి ఆ నోట్ల ప్రింటింగ్ నిలిపివేశారు. మనీలాండరింగ్ అరికట్టేందుకు ఈ చర్యకు తీసుకున్నట్లు సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.

 

ఆసియాలో చాలా  దేశాలలో పెద్ద నోటువిలువ పది డాలర్లు మించదు. పేద దేశాల జాబితాలో ఉన్న మంగోలియా, లావోస్,  మ్యాన్మార్, నేపాల్, పాకిస్తాన్ లలో  పెద్దనోట్లు న్నా వాటి విలువ చాలా తక్కువ. 10 అమెరికా డాలర్లు మించదు. ఒక్క కంబోడియా మాత్రమే 25 అమెరికన్ డాలర్ల విలుయిన నోటును తీసుకువచ్చింది. పెద్ద నోటున్న మరొక అసియా భూభాగం హాంకాంగ్. అక్కడి నోటు విలువ  HK$ 1000( విలువ 130 అమెరికన్ డాలర్లు). ఈ నోటు బజార్లో కనిపించడం అరుదు. భారీ రెంట్లు చెలించేందుకే వినియోగిస్తారట.ఇపుడు ఈ  ప్రభుత్వం  కూడా చిన్న నోట్ల వైపే మొగ్గు చూపుతూ ఉంది.

 

‘పేదరికం, అవినీతి తీవ్రంగా ఉన్నదేశాలలో పెద నోట్లను తీసుకురావడం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి,’ అర్థిక నిపుణులుచెబుతుంటారు.

 

ఇక యూరోపియన్ యూనియన్ సంగతి చూడండి.  అక్కడి పెద్ద నోట్  యూరో 500 ని  ఎత్తేయాలని చూస్తున్నారు. జి 10 దేశాలలో , స్విస్ ఫ్రాంక్ 1000 నోట్ ( $1040) తర్వాత ఇదే అతిపెద్ద నోటు. ఇపుడు 307 బిలియన్ యూరో ల విలువయిన 500 యూరోలు చలామణి లో ఉన్నాయట.ప్రపంచంలో అత్యంతవిలువయిన మరొకనోటు బ్రూనీ లో ఉంది. దాని విలువ  10,000 బ్రూనీ డాలర్లు. అంతేకాదు, అత్యంత భద్రత ఉన్న నోటు కూడా ఇదే నని చెబుతారు. ప్రపంచంలోని మరొక విలువయిన నోటు కెనడా 1000 డాలర్ నోట్.  దీనిని 1992లో తీసుకువచ్చారు. 2000 లో రద్దు చేశారు.

 

ఇపుడు  అమెరికా వాళ్లకు   100 డాలర్లనోటు బరువనిపిస్తూ ఉంది.  దానిని కూడా   నిషేధిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. ఎందుకంటే, అధికారుల కన్నుగప్పి రహస్యంగా చేరవేసేందుకు ఈ నోటు అనుకూలంగా ఉంటుందట.  ఒక మిలియన్ 100 డాలర్ల నోట్ల బరువు కేవలం ఒక కెజి మాత్రమే లేదా లాప్ టాప్ బరువు.

 

ఇదీ ప్రపంచంలో పెద్ద నోట్ల సంగతి. ఇండియాలో  2000 నోటు రావడం వెనక పెద్ద రాజకీయమే ఉంటుంది, నిదానంగా విషయాలు బయటపడతాయి.

 

 

 

loader