Asianet News TeluguAsianet News Telugu

వాహనం సైరన్ మోగించినందుకు పోలీసులపైనే దాడి

ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసులు రాత్రీ,పగలు అని తేడా లేకుండా విధులు నిర్వహిస్తుంటారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు, దొంగతనాలు జరక్కుండా రాత్రుల్లో కూడా గస్తీ కాస్తుంటారు. ఇలా బీమవరంలో నైట్ బీట్ కు వెళ్లిన పోలీసులపై ఓ ఇద్దరు యువకులు దాడి చేశారు. ఎందుకో తెలుసా? పోలీస్ వెహికిల్ సైరన్ ను తమ ఇంటి ముందు మోగించినందుకు. ఈ  ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 
 
  భీమవరం టూ టౌన్ ఎస్సై కాళీచరణ్‌ తెలిపిన వివరాలిలా ప్రకారం...పట్టణంలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించడానికి ఒక హెడ్‌కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ కలిసి పోలీస్  జీపులో వెళ్లారు. అయితే వీరు జువ్వలపాలెం మార్గంలో వెళుతుండగా ఒక ఇంటి వద్ద లైట్లన్నీ వెలిగి ఉండడాన్ని గమనించారు. దీంతో అనుమానం వచ్చి జీపు సైరన్‌ ఆన్ చేశారు. దీంతో ఆ ఇంట్లోంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చి గొడవకు దిగారు. తాము గస్తీలో భాగంగానే ఇలా చేశామని చెబుతున్నా వినకుండా దాడిచేయడంతో పాటు మళ్లీ కనిపిస్తే బావుండదని హెచ్చరించారు.

ఈ దాడిలో స్వల్ప గాయాలపాలైన పోలీసులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వారిపై జరిగిన దాడిపై ఎస్సైతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.  

two people attack on police in bhimavaram

Follow Us:
Download App:
  • android
  • ios