ఆఫీస్ లో రికార్డ్ డ్యాన్స్ బాగుంది, కాని ఉద్యోగం వూడింది (వీడియో)

ఆఫీస్ లో రికార్డ్ డ్యాన్స్ బాగుంది, కాని ఉద్యోగం వూడింది (వీడియో)

ఆఫీసును పబ్‌లా మార్చేసిన ఇద్దరు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులపై వేటు పడింది. పని ఎగ్గొట్టి కార్యాలయంలో చిందులేసిన మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన  ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ దివాస్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. జరిగిందేమిటో తెలుసా? ఏప్రిల్‌ 13న జిల్లా కార్యాలయంలో బాలీవుడ్‌ పాటలు పెట్టుకుని  ఉత్సాహంగా డాన్సులు చేశారు. కజరారే.. కజరారే అంటూ మస్త్‌ మజా చేశారు. జిల్లా ప్రాజక్టు ఆఫీసర్ లు  సునీత్‌ యాదవ్‌, ప్రియాంక జైశ్వాల్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈ పార్టీ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఇదంతా వీడియో కెక్కించారు. ఇదే లీకయి సోషల్‌ మీడియాలో వైరలయింది. దీనితో ఆగ్రహించిన  కలెక్టర్‌ ఆశిష్‌ సింగ్‌ చర్యలు చేపట్టారు చిందులేసిన సిబ్బందిని  సస్పెండ్‌ చేశారు. వీరితో కలిసి డాన్స్‌ చేసిన ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos