టీవీఎస్ నుంచి మరో కొత్త మోడల్ బైక్

First Published 2, Feb 2018, 5:39 PM IST
TVS Apache RTR 200 4V ABS Launched In India
Highlights
  • భారత మార్కెట్ లోకి టీవీఎస్ కొత్త మోడల్ బైక్

 ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ టీవీఎస్.. భారత మార్కెట్ లోకి మరో కొత్త మోడల్ బైక్ ని ప్రవేశపెట్టింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 2004వీ పేరిట బైక్ ని మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని ధర రూ.1,07,485( ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర) గా కంపెనీ ప్రకటించింది.  దీనిలో డ్యూయల్ చానెల్ యాంటీ లాక్ బ్రేక్స్ సిస్టమ్ ఉన్నట్లు తెలిపింది.

199సీ సింగిల్ సిలిండర్  ఇంజిన్ ని ఏర్పాటు చేశారు. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ సదుపాయం కూడా ఉంది. గంటకు 127 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది . గత మోడల్స్ తో పోలిస్తే.. దీనిలో అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచారు.

loader