జెమిని టీవీలో వచ్చే సప్తమాత్రిక సీరియల్ లో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు. ఆరుగురు పతివ్రతలు, ఇతర సీరియల్స్ లోనూ ఆయన నటించాడు

ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు.

బుధవారం తెల్లవారు జామున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పుప్పాలగూడ అల్కాపురి కాలనీ గ్రీన్‌ ఇకానియా అపార్ట్‌మెంట్‌లో ఆయన నివాసం ఉంటున్నారు.

ప్రదీప్ ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. అంతా మిస్టరీగా ఉంది.

ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రదీప్ భార్య పావనిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

జెమిని టీవీలో వచ్చే సప్తమాత్రిక సీరియల్ లో ప్రదీప్ హీరోగా నటిస్తున్నాడు. ఆరుగురు పతివ్రతలు, ఇతర సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. 

ప్రదీప్ భార్యపేరు పావని కూడా టివి నటియే. ఆమె అగ్నిపూలు అనే సీరియల్‌లో నటిస్తోంది.

గత ఏడాది ఆగస్టులో పావనిరెడ్డిని ప్రదీప్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.