Asianet News TeluguAsianet News Telugu

ఎలాంటి తలనొప్పి అయినా.. చిటికెలో మాయం

చిటికెడు పసుపు చాలు.. నొప్పి చిటికెలో మాయం
Turmeric could help reduce migraine attacks, experts reveal

ఇండియన్స్.. దాదాపు అన్ని వంటకాల్లోనూ పసుపుని వాడుతుంటారు. పసుపులో చాలా ఔషద గుణాలు ఉన్నాయని మనకు తెలుసు. క్రిమి సంహారిణిగా పసుపు పనిచేస్తుందన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. తాజాగా పసుపు గురించి మరో ఆసక్తికర , ఆరోగ్యకర విషయం తెలిసింది. చిటికెడు పసుపుతో.. ఎలాంటి తలనొప్పి అయినా.. చిటికెలో మాయం చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

మీరు చదివింది నిజమేనండి. మైగ్రేన్ లాంటి తలనొప్పిని కూడా పసుపు నయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో కర్కూమిన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గానూ, యాంటీ ఇన్ ఫ్లామేటరీగానూ పనిచేస్తుంది. వీటి కారణంగా తలనొప్పిని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకి మూడు స్పూన్ల పసుపుని ఏదో ఒక విధంగా ఆహారంలో తీసుకుంటే.. మైగ్రేన్ ని నయం చేయవచ్చని వారు పేర్కొన్నారు. యాంటీ ఇన్ ఫ్లామేటరీ సాధారణంగా పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది. ఇది పసుపులో కర్కూమిన్ రూపంలో పుష్కలంగా ఉందని వారు సూచిస్తున్నారు.

ఇప్పటివరకు మైగ్రేన్ కి సరైన చికిత్స అంటూ లేదు. కాగా.. దీనిపై పలు రకాల పరిశోధనలు చేసిన నిపుణులు ఈ విషయాన్ని తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios