శ్రీవారి దర్శనం...క్యూనుంచి ఫోన్ చేస్తే అన్న ప్రసాదం వస్తుంది

TTD to offer Annaprasadam with a phone call at queue complex
Highlights

శ్రీవారి కాలిబాట దివ్యదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారాంతంలో దివ్యదర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. అయితే,  నడకదారిన తిరుమల వచ్చే  భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
 


 తిరుమల: వారాంతంలో విపరీతంగా పెరుగుతున్న  భక్తుల రద్దీకి తగ్గట్టు తగిన ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి సమాయత్తమవుతూ ఉంది.   వైకుంఠం క్యూకాంప్లెక్సు -1, 2లలోని అన్ని కంపార్ట్‌మెంట్లలో తక్షణమే ఫోన్‌ సౌకర్యం కల్పిస్తారు.  భక్తులు ఫోన్‌ చేసినపుడు అన్నప్రసాదం, వైద్యం, ఆరోగ్య, విద్యుత్‌, వాటర్‌వర్క్స్‌, జలప్రసాదం తదితర విభాగాల అధికారులు వెంటనే స్పందించాలని టిటిడి జెఇఒ శ్రీనివాసరాజు ఆదేశాలు జారీ చేశారు.

శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయ సేకరణ జరుగుతోందని, ఇందుల్లో వెల్లడయ్యే సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని జెఈవో సూచించారు. హెల్ప్‌డెస్క్‌ల వద్ద తగినంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచి భక్తులకు సరైన సూచనలు, సలహాలు అందించాలన్నారు. అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎప్పటికప్పుడు శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాల సమాచారాన్ని అందించేందుకు డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించేలా సూచికబోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఇది ఇలా ఉంటే...

శ్రీవారి కాలిబాట దివ్యదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారాంతంలో దివ్యదర్శనం నిలిపివేస్తున్నట్లు టీటీడీ బుధవారం ప్రకటించింది. అయితే,  నడకదారిన తిరుమల వచ్చే  భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
 

కాలిబాటల్లో నడిచి తిరుమలకు చేరుకుని, నారాయణగిరి ఉద్యానవనంలో క్యూ పెరిగిపోవడంతో  భక్తులు అవస్థలు పడుతున్నారు. కాలిబాటల్లో వచ్చిన తమను పట్టించుకోవడం లేదని వారు  టీటీడీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. 

 

భవిష్యత్తులో ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ  భావిస్తున్నారు.దీంతో రద్దీ ఉండే రోజుల్లో అంటే.. శుక్ర, శని, ఆదివారాల్లో కాలిబాట దర్శనాన్ని టీటీడీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
 
లడ్డూ భారమవుతున్నది


టీటీడీపై శ్రీవారి లడ్డూల భారం ఏటా సుమారు రూ.150 నుంచి రూ.180 కోట్ల వరకూ పడుతోందని లెక్కలు కట్టారు.

loader