టీటీడీ( తిరుమల తిరుపతి దేవస్థానం) ఉద్యోగుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఇతర మతాల ఉద్యోగులను ఏరివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 45మందికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో.. ఇతర ఉద్యోగుల్లో కలవరం మొదలైంది.

వివరాల్లోకి వెళితే.. టీటీడీలో మొత్తం 10వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వారిలో హిందువులతోపాటు అన్య మతస్థులు కూడా ఉన్నారు. అయితే.. వారిలో డిప్యూటీ ఈవో స్థాయి అధికారి గతేడాది టీటీడీ వాహనంలో చర్చికి వెళ్లారు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది.  దీంతో.. టీటీడీలో పనిచేసే అన్యమతస్థులను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు 45మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందజేసింది. త్వరలోనే మిగిలిన ఉద్యోగులను కూడా తొలగించేందుకు ప్రణాళిక తయారుచేస్తోంది.

ఇదిలా ఉండగా.. టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు భక్తులు, రాజకీయ నాయకుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుండగా.. ప్రతిపక్ష, వామపక్ష నేతలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.