Asianet News TeluguAsianet News Telugu

మెట్రో కారిడార్లకు ప్రత్యేక బస్సలు..!

  • ఎల్బీనరగ్ నుంచి  నగరంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ 760 బస్సులను నడుపుతోంది
  • వాటి సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు.
TSRTC plans buses across Metro corridors

 

వచ్చే  నవంబర్ లో మెట్రో పరుగులు తీయడానికి సిద్ధమౌతోంది. మెట్రో కనుక ప్రారంభమైతే.. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుంది.  అంతేకాకుండా ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించడానికే ఆసక్తి చూపుతారు.  దీంతో.. ఇప్పుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి సంఖ్య తగవచ్చు. అయితే..ఇది ఆరంభమే  కాబట్టి.. పెద్దగా ఆర్టీసీకి నష్టం ఉండకపోవచ్చు.. కానీ భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది తెలంగాణ ఆర్టీసీ  కాస్త నష్టం కలిగించే విషయమే. అయితే.. దీనికి అదిగమించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే మెట్రో కారిడార్లకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయబోతోంది.

నవంబర్ లో మియాపూర్ నుంచి నాగోల్ కి మెట్రో రైలు ప్రారంభిస్తున్నారు. మియాపూర్ నుంచి నాగోల్ లోపు ఎక్కడికి వెళ్లాలన్నా.. మెట్రో ఎక్కితే సరిపోతుంది. అయితే.. మెట్రో ఎక్కడానికి కారిడార్ కి వెళ్లాలి కదా..దిగిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లాలన్నా.. రవాణ సదుపాయం కావాలి. దీనికి ఆర్టీసీ వినియోగించుకుంటోంది. అందుకే ప్రత్యేకంగా మెట్రో కారిడార్లకు బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎల్బీనరగ్ నుంచి  నగరంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ 760 బస్సులను నడుపుతోంది . మెట్రో ప్రారంభం కాగానే.. వాటి సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. మెట్రో ఇప్పుడే ప్రారంభం అవుతుంది కనుక ఆర్టీసీకి వచ్చిన నష్టమేమీ లేదని సంబంధిత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios