అర్థ సెంచరీలు సాధించిన కోహ్లీ, ముకుంద్. నిలకడగా టీం ఇండియా బ్యాటింగ్. త్వరగా కుప్పకూలిన శ్రీలంక.
గాలే లో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 291 పరుగులకే అలౌట్ అయింది. దీంతో భారత్‌కు 309 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. శ్రీలంక జట్టులో మ్యాథ్యూస్ 83, పెరీరా 92 పరుగులతో లంకను ఆదుకున్నారు. భారత బౌలింగ్ కి లంక బ్యాట్స్‌మెన్లు ఇబ్బంది పడ్డారు. పెరీరా, మాథ్యూస్ ఆడడంతో లంక ఈ మాత్రం స్కోరైనా చేసింది. భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు, మహ్మద్ షమీ రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్, అశ్విన్, పాండ్యాలు ఒక్కోవికెట్ పడగొట్టారు.
శ్రీలంక బ్యాట్స్‌మెన్ పెరీరా భారత బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టాడు. అల్‌రౌండర్ పాండ్యాకు కోహ్లి బంతి అప్పగించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన పాండ్యా రెండో ఓవర్‌లోనే ప్రదీప్‌ను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 71వ ఓవర్‌లో పాండ్యా మొదటి ఓవర్ వేయడం గమనార్హం.
ఆధిక్యం లభించినా బ్యాటింగ్‌కే మొగ్గు.
ఇండియా భారీ అధిక్యం లభించింది అయినా కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్ చెయ్యడానికే ఇష్టపడ్డారు. బ్యాటింగ్ పిచ్ అయినా రెండవ, మూడవ రోజు బౌలింగ్ కు అనుకులించింది. పిచ్ పై బాల్ టర్న్ అవుతుంది. నాలుగవ ఇన్నీంగ్స్ లో అయితే బాల్ మరింత టర్న్ అవుతుండవచ్చు అని కోహ్లి బ్యాటింగ్ కి మొగ్గు చూపారని తెలుస్తుంది.
రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా. త్వరగానే రెండు వికెట్లు పడ్డావి. మొదటి ఇన్నింగ్స్ లో 190 పరుగుల చేసిన శిఖర్ ధావన్ 14 పరుగులకే దిల్ రేవన్ పెరీరా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చటేశ్వర్ పూజరా కూడా 15 పరుగులకే వెనుదిరిగాడు. అభినవ్ ముకుంద్ అర్థ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 116 బంతులకు 81 పరుగులు చేసి ఆవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కోహ్లి 76 పరుగుల నాటౌట్ గా ఉన్నాడు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 189 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్ కొనసాగిస్తుంది.
