Asianet News TeluguAsianet News Telugu

ఎర్రగడ్డకు ఎమైనా వస్తారా.. ?

  • రోజుకో మాట మాట్లాడుతున్న ట్రంప్
  • నిన్న వలసదారుల ఉద్యోగాలపై హామీ
  • ఇప్పుడు హెచ్ 1 బి వీసాల అనుమతికి నో
trump twist on hb visa

తాటిమట్టకు... ట్రంప్ నోటిమాటకు పెద్ద తేడా ఏం లేనట్టే ఉంది. హైదరాబాద్ లో అడ్డమైన మలుపు తిరిగే ఫ్లైఓవర్ లాగా ఆయన మాటలు కూడా మలుపులు తిరుగుతున్నాయి.

 

పీఠం ఎక్కకముందే అందరి పీఠాలు కదిలిస్తున్నాడు. ఇక అధ్యక్షుడిగా వైట్ హౌజ్ లో కాలుమోపితే పరిస్థితి ఏంటో తెలియడం లేదు.

 

ఎన్నికల ప్రచారం లో అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. అటు తర్వాత మాట మార్చాడు.

 

నిన్న టైమ్ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలివైన వారికి అమెరికా ద్వారాలు తెరిచే ఉంటాయి. వలసదారుల ప్రతిభను వినియోగించుకుంటామని చెప్పాడు.

 

 

24 గంటలు గడవక ముందే మళ్లీ మాట మార్చేశాడు. అమెరికన్ ఉద్యోగులకు పొగపెడుతున్న హెచ్1బి వీసాలను ఇక పై అనుమతిచ్చేది లేదని కుండబద్దలు కొట్టాడు.

 

ఇకపై విదేశీయులకు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వమని తెగేసి చెప్పాడు.

 

కాగా, డిస్నీ వరల్డ్ సహా పలు అమెరికన్ కంపెనీలలో చాలామంది భారతీయులు హెచ్1బి వీసాలతో వచ్చి  యూఎస్ లో పనిచేస్తున్నారు. అలాంటి కంపెనీలపై ట్రంప్ మాటల ప్రభావం బాగా పడనుంది.

 

ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ట్రంప్ వలసదారుల వల్లే అమెరికన్ల ఉద్యోగాలు పోయాయని విషం కక్కాడు. తాను అధ్యక్షుడు అయ్యాక ఇలాంటివి ఇక ఏమాత్రం జరగనిచ్చేది లేదని హెచ్చరించారు.

 

ఇప్పుడు ఆ మాటలను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఉన్నాడు.

 

ప్రపంచానికే పెద్దన్న అమెరికా.. అలాంటి దేశానికి కాబోయే అధ్యక్షుడు ఇలా రోజుకో మాట మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

యూఎస్ లోని ప్రధాన పత్రికలు కూడా ట్రంప్ పై దుమ్మెత్తిపోశాయి. అయినా ఆయనలో పెద్దగా మార్పు కనిపించడం లేదు కదా పైగా రోజుకో మాటతో వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

 

కనీసం ఎర్రగడ్డ కు వచ్చి కాస్త చికిత్స తీసుకుంటే ట్రంప్ లో  ఎమైనా ఫలితం ఉంటుందోనని సగటు భారతీయుడి ఆశ.

 

ట్రంప్ గారు ఇంతకీ ఇండియా ఎప్పుడొస్తారో మరి..

Follow Us:
Download App:
  • android
  • ios