ట్రంప్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి

Trump Tower fire: man dies in blaze on 50th floor
Highlights

ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు

న్యూయార్క్ లోని ట్రంప్ టవర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. న్యూయార్క్‌ సిటీ అగ్నిమాపక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా.. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుటుంబ సభ్యులెవరూ కూడా ఈ భవంతిలో లేరని అగ్నిమాపక కమిషనరు డేనియల్‌ నిగ్రో వెల్లడించారు. 50 వ అంతస్తులో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలిపారు. ట్రంప్‌ టవర్‌లో  చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయనీ....అగ్నిమాపక సిబ్బంది కృషికి అభినందనలు అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆ తర్వాత ట్వీట్‌చేశారు. కాగా.. మంటలు అదుపుచేయడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందిలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

loader