ఎన్నకలప్పుడు ఒక మాట.. ఎన్నికలయ్యాక ఒక బాట.. ఇది మనదేశంలోనే కాదు.. అమెరికాలోనూ కూడా ఇంతే అనుకుంటా..

 

అగ్రరాజ్య కాబోయే పెద్దన్న ట్రంప్ మాటలు వింటే  ఇది నిజమే అనిపిస్తుంది.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ తన నోటి దురుసుతో వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు.

 

మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టిస్తాం... ఇండియా వాళ్ల ఉద్యోగాలు పీకేస్తా... చైనా దూకుడుకు కళ్లెం వేస్తా నంటూ చిందులేశాడు.

 

ఇప్పుడు గెలిచాక అసలు అమెరికా ఎవరి వల్ల ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకున్నట్లు ఉన్నాడు. వెంటనే యూ టర్న్ తీసుకున్నాడు. ముఖ్యంగా హెచ్1-బీ వీసాలపై తన వైఖరిని పూర్తిగా మార్చేసుకున్నాడు.

 

‘టైమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ దీనిపై మాట్లాడుతూ ‘‘మనకు వర్కర్లు అవసరం, ప్రతిభ ఉన్న వాళ్లు ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉద్యోగాలుంటాయి‘ అని సెలవిచ్చారు.

వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్  ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.