ట్రంప్ అలా అడిగారు: గుట్టు విప్పిన బిల్ గేట్స్, నవ్వులే నవ్వులు

Trump asked me the difference between HIV and HPV: Bill Gates
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. 

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి బిల్ గేట్స్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. ట్రంప్ కు హెచ్ఐవికి, హెచ్ పివికి మధ్య తేడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. 

గేట్స్ ఫౌండేషన్ కు సంబంధించిన చర్చ కార్యక్రమం అది. ట్రంప్ కు తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి బిల్ గేట్స్ వివరించారు. తామిద్దరం 2016లో ఒకసారి కలిశామని, అప్పుడు హెచ్ఐవి, హెచ్ పీవి ఒక్కటేనా అని ట్రంప్ అడిగారని గేట్స్ చెప్పారు.

ఆ రెండింటికి గల తేడాను తాను వివరించినట్లు తెలిపారు. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కు సంబంధించిందని, హెచ్ పివి సుఖవ్యాధులకు సంబంధించినవని అన్నారు. దాన్ని తేలిగ్గా నయం చేసుకోవచ్చునని కూడా చెప్పనట్లు తెలిపారు 

మరోసారి 2017 మార్చిలో అదే విషయం ట్రంప్ అడిగారని, మళ్లీ వివరించానని ఆయన చెప్పారు. దాంతో చర్చా కార్యక్రమంలోని వారు నవ్వును ఆపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను అమెరికా చానెల్ ఒకటి తన ట్విటర్ లో పోస్టు చేసింది. అది ఇప్పుడు వైరల్ అవుతోంది.  

loader