రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ మృతి

రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పీఏ మృతి

మెదక్  జిల్లాప్రజ్ఞాపూర్  సమీపంలో రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.  రోడ్డు పక్కన ఆగివున్న లారీని వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పీఏ బాల గంగాధర్ అతని భార్య విజయ మృతి చెందారు. కారు పూర్తిగా లారీ కింద ఇరుక్కుపోవడంతో మృతదేహాలు కూడా అందులోనే చిక్కుకున్నాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బైటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. కట్టర్ ల సాయంతో కారు ను కట్ చేసి మృతదేహాలను బైటికి తీయడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. కారుతో పాటు కారులోని శవాలు కూడా నుజ్జు నుజ్జు అయిపోవడంతో బైటికి తీయడానికి సమయం పడుతోంది. ఈ దంపతులు హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.


 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos