బాల్ ట్యాంపరింగ్ వల్ల.. నన్ను నా భార్య వదిలేసింది

First Published 28, Mar 2018, 2:27 PM IST
Trevor Chappell no longer the most hated man in cricket
Highlights
ఆవేదన వ్యక్తం చేసిన క్రికెటర్

క్రికెట్ మాట వినపడితే చాలు.. ప్రస్తుతం అందరూ బాల్ ట్యాంపరింగ్ గురించే చర్చించుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో మూడు రోజుల క్రితం జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు.. బాల్ ట్యాంపరింగ్ కి పాల్పడిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ ముగ్గురు ఆసిస్ క్రికెటర్లపై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. కాగా.. ఇలాంటి వివాదంలోనే గతంలో ఇరుకున్న ఆసిస్ మరో ప్లేయర్ ట్రావర్ చాపెల్.. ఈ ఘటనపై స్పందించారు.

టాంపరింగ్‌కి పాల్పడిన ఆసీస్ క్రికెటర్లు స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లను ఈ తప్పు జీవితాంతం వెంటాడుతుందని అభిప్రాయపడ్డాడు. మూడు దశాబ్దాల క్రితం తాను తప్పు చేస్తే.. ఇంకా ఆ శిక్ష అనుభవిస్తుండమే దానికి ఉదాహరణ అని ట్రెవర్ చెప్పుకొచ్చాడు. 1981 బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్‌ వరల్డ్‌ సిరీస్‌ కప్‌లో న్యూజిలాండ్ విజయానికి చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి వచ్చింది. దీంతో.. అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌.. తన తమ్ముడైన బౌలర్‌ ట్రెవర్‌ చాపెల్‌తో అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేయించాడు. దీంతో.. ట్రెవర్ బంతిని పిచ్‌పై దొర్లించగా.. కివీస్ బ్యాట్స్‌మెన్ దాన్ని షాట్ ఆడలేకపోయాడు. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలుపొందింది. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా గెలిచిన ఆస్ట్రేలియాపై, అండర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ చేసిన ట్రెవర్‌పై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. 

ఈ విషయాన్ని తాజాగా ట్రావర్ చాపెల్ గుర్తు చేసుకున్నారు. ‘ఆ మ్యాచ్‌లో అండర్ ఆర్మ్ బౌలింగ్‌తో నా జీవితం నాశనమైంది. ఇప్పటికీ ఆ ఘటన గురించి అందరూ నన్ను అడుగుతుంటారు. సుదీర్ఘకాలంగా చాలా మానసిక క్షోభ అనుభవించాను. నా భార్య నన్ను విడిచి పెళ్లిపోయింది. మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు లేరు. మా అన్న గ్రెగ్‌ చాపెల్‌ గొప్ప విజయాలు సాధించాడో లేదో తెలియదు కానీ.. ఆస్ట్రేలియా క్రికెట్‌కి చెడ్డపేరు తీసుకొచ్చిన జాబితాలో ఇప్పటి వరకు నాపేరే మొదట ఉండేది. ఇకపై బాల్ టాంపరింగ్‌కి పాల్పడిన వారి పేర్లు వస్తాయి. ఇది నాకు కొంచెం ఉపశమం కలిగించనుంది. ఆరోజు అలా బౌలింగ్ చేయాలని మా అన్న చెప్పడం సరైన సలహాగా అనిపించింది. కానీ.. ఈ రోజుల్లో అలా చేయడం సమంజసం కాదు. క్రికెట్‌లో చీకటి రోజుకి కారణమైన వారు జీవితాంతం బాధపడాల్సిందే..!’ అని ట్రెవర్ స్పష్టం చేశాడు.

loader