Asianet News TeluguAsianet News Telugu

నిమజ్జనానికి 4వేల వాహనాలు..!

  • గ్రేటర్ వ్యాప్తంగా 12 పూలింగ్ స్టేషన్ల ఏర్పాటు
  • ఒక్కో పూలింగ్ స్టేషన్కు ఒక్కోరవాణా అధికారి నియామకం
transport department alloted 4k vehicles for ganesh visarjan

 

గణేష్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే నిమజ్జనానికి 4 వేల వాహనాలను అందజేయనున్నట్లు గ్రేటర్ రవాణాశాఖ అధికారి పాండురంగనాయక్ తెలిపారు. దీని కోసం గ్రేటర్ వ్యాప్తంగా 12 పూలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ విషయమై గణేష్ ఉత్సవ కమిటీ, ట్రాఫిక్ పోలీసులతో గ్రేటర్ రవాణా శాఖ అధికారులు చర్చలు జరిపారు.

వాహనాల సమీకరణ కోసం నగర వ్యాప్తంగా పూలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. ఒక్కో పూలింగ్ స్టేషన్కు ఒక్కోరవాణా అధికారిని నియమించినట్లు తెలిపారు. ఆ పూలింగ్ స్టేషన్ బాధ్యత అంతా ఆ అధికారిపై నే ఉంటుందని ఆయన వివరించారు.

సికింద్రాబాద్ పూలింగ్ స్టేషన్ - ఆర్టీవో వెంకటరమణ, నాగోల్- ఎంవీఐ ప్రసాద్ రెడ్డి, జూపార్క్- పురుషోత్తం, మోహదీపట్నం- ఆర్టీవో సి.రమేష్, మన్నెగూడ- ఎంవీఐ బలరాం, నెక్లెస్ రోడ్- ఎంవీఐ ఎ

శ్రీనివాస్, మేడ్చల్-  ఎంవీఐ కిషన్, చంపాపేట్- ఎంవీఐ లక్ష్మణ్, మలక్ పేట్ ఆర్టీవో మోయిన్, పటాన్ చెరు ఎంవీఐ రాజ్ మహ్మద్, ఆటోనగర్ ఎంవీఐ గోవర్థన్ రెడ్డి, గచ్చిబౌలి - ఎంవీఐ సాయిరాంరెడ్డి లకు అప్పగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios