లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ జిల్లాలో గురువారం ఉదయం రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఓ పాఠశాల బస్సును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 13 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మృతులు డివైన్ పబ్లిక్ స్కూల్ కు చెందినవారు. ఈ నెలలోనే అటువంటి సంఘటనే మరోటి జరిగింది. ఏప్రిల్ లో 10వ తేదీన జరిగిన ప్రమాదం 27 మంది పిల్లలు మరణించారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో పాఠశాల బస్సు 100 అడుగుల లోతు గల లోయలో పడడంతో ఆ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన 27 మంది పిల్లలు కూడా పది లోపు వయస్సు గలవారే.