సోషల్ మీడియాలో రిలీజయిన పూరీ డ్రగ్ ట్రాజెడీ వీడియో సూపర్ హిట్ ఆయన మీడియా మీద చేసిన కామెంట్లు ఇంకా హిట్ అయితే, కళ్లలో నిజాయితీ లేదని కొందరి విమర్శ

pic.twitter.com/YYr1Nbug9g

Scroll to load tweet…

పూరీ జగన్నాధ్ సూపర్ హిట్ దర్శకుడు. పోకిరి, ఇడియట్, లోఫర్, ఇజం వంటి సినిమాలో ఎంత హిట్టాయ్యోయో మనం చూశాం. ఆయన నటనను ఎలా వెలికి తీయగలడో చూశాం.

ఇపుడు ఆయనే కెమెరా ముందుకొచ్చి, సీన్ లో నటిస్తే... అది ట్రాజిక్ సీన్... అయితే...

అయితే,అయింది, అది ఆయన సినమాల్లాగే సూపర్ హిట్టయింది.

ఈ ట్రాజిక్ చలన చిత్రం బుధవారం అర్ధరాత్రి రిలీజయింది. ట్విట్టర్, ఫేస్ బుక్ లో మాత్రమే రిలీజ్ చేశారు. అయితేనేం సూపర్ హిట్. బుధవారం నాడు సిట్ విచారణ తర్వాత నేరుగా ఆయన ఇంటికెళ్లిపోయి, మెఖానికి రంగులేమేసుకోకుండా సహజంగా కెమెరాముందుకొచ్చితన మనుసులోని ఆవేదనను వెలిగక్కారు. ఈ చిత్రం నిడివి 2.14నిమిషాలు. డ్రగ్స్ గురించి మీడియా వాళ్ల ఎలా కొంపముంచింది, ఇంటి దగ్గిర భార్య పిల్లలు ఎలా ఎడుస్తున్నారో ఆయన సహజ సిద్ధంగా చెప్పారు.ఈ డైలాగ్ డెలివరీ చాలా మంది బౌలయిపోయారు. దుంఖించారు. శోకించారు.ఆగ్రహించారు. మీడియా మీద ఆక్రోశం వెలిబుచ్చారు.

ఈ 2.14 నిమిషాలను వీడియోను లక్షల సంఖ్యలో చూశారు. పేస్ బుక్ అ 5.80 వేల మంది చూశారు. 20 వేల మంది మంది లైక్ చేశారు. 968 మంది కామెంట్లు పెట్టారు. 5093 వేల మంది షేర్ చేశారు.

కొందరు రెచ్చి పోయి మీడియా మీద దెమ్మెత్తిపోశారు. ఒకరేమో నీకళ్లలో నిజాయితీ లేదు బాబాయ్, అయిదు సెకండ్లు కెమెరా వైపు చూసి మాట్లాడు పూరీకి సలహా ఇచ్చారు.

ఇక ట్విట్టర్లో 48.3 వేల మంది చూశారు. 2 వేల మంది షేర్ చేశారు. 6.8 వేల మంది లైక్ చేశారు. 970 మంది కామెంట్ చేశారు.

ఆయన వీడియోచూశాకే ప్రకాశ్ రాజ్, వార్ని మీడియా వాళ్లు నిజం తెలుసకోకుండా రాస్తున్నారు, అది మంచిది కాదని ఒక సలహా పడేశారు. ఇలాగే చాలా మంది నటులు అగ్రశ్రేణి దర్శకుడికి వత్తాసు పలికారు.

అయినా, సరే, ఇపుడున్నపరిస్థితులలో సెలెబ్రెలకు హాని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. కేవలం నయీం లాంటి వాళ్లు ఎన్ కౌంటర్ అవుతారు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ లాంటి కొద్ది రోజులు అజ్ఞాతం వెళ్లి పోతారు. విజయ్ మాల్యాలాంటివాళ్లే ఎంపీకుతార్రా అని ఇంగ్లండుకు పారిపోతారు. పొలిటికల్ సెలెబ్రిటీలు రూలింగ్ పార్టీ లోకి ఫిరాయించి పునీతులవుతారు. కాటట్టి సెలెబ్రెటీ పూరీ జగన్నాధ్ వార్తలగురించి భయపడాల్సిన పనిలేదు. ఏమికాదు, రెండురోజులు మీడియా వాపు నొప్పి తప్ప.