Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ ఎస్ ప్రభుత్వానికి ఉత్తమ్ హెచ్చరిక

రైతులకు మేలు జరిగే విషయంలో పూర్తిగా సహకరిస్తాం. అన్యాయం జరిగితే ఉద్యమిస్తాం

tpcc president uttam warns government against arresting Congress leaders bebore march to Assembly

రేపటి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కెసిఆర్ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ అణచి వేత విధానాలు మానుకోవాలని సూచించారు.ఈ నిర్బంధాన్ని, అణచివేతలను, అప్రజాస్వామిక పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని  ఆయన చెప్పారు.రైతు సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ శుక్రవారంనాడు  చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చింది. అయితే,  రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఉత్తమ్ ఈ హెచ్చరిక చేశారు. ప్రభుత్వానికి రైతులకు మేలు జరిగే విషయంలో పూర్తిగా సహకరిస్తామని అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన లోని మరికొన్ని అంశాలు:

  • అరెస్ట్ చేసిన వాళ్లను వెంటనే  భేషరతుగా విడుదల చేయాలి, శాంతి యుతంగా చలో అసెంబ్లీ కార్యక్రమం జరిగేలా ప్రభుత్వం సహకరించాలి, పోలీసులతో పాలన సాగించడం ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదు.
  • ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది.నిన్ననే మంత్రి హరీష్ రావు ఏదైనా జరిగితే కాంగ్రెస్ దే బాధ్యత అని మాట్లాడారు.
  • అంటే అరెస్టులు చేస్తూ, అణచివేస్తూ ఏదైనా జరిగితే కాంగ్రెస్ భాద్యత అనడంలో అర్థం ఏమిటి, ఎందుకు ఇలా రెచ్చగోడుతున్నారు.
  • రైతు సమస్యల పరిష్కారానికి ఎట్టి పరిస్థిల్లోనూ చలో అసెంబ్లీ జరిపి తీరుతం.. అణచివేత మీద ఉన్న శ్రద్ధ పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం ఇప్పించడంలో చూపించండి,
  • కల్తీ విత్తనాలు అరికట్టి రైతులను ఆదుకోండి, మార్కెట్లలో పంటలను కొనేందుకు అన్ని సౌకర్యాలు కల్పించండి.
  • సీసీఐ కొనుగోలు కేంద్రాల ప్రకటనలు అమలు కావడంలేదు, పత్తి 15 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేసి రైతులక్ను ఆదుకోవాలి.
  • పంటలాభీమ ఏమైంది, ఒక రైతుకు న్యాయం జరగడం లేదు, రైతు కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు.. మొండి వైఖరి మాని రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి.
Follow Us:
Download App:
  • android
  • ios