ఈ ఏడాది ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..

Top smartphones the world searched for this year you wont believe who made it to the list
Highlights

  • ఈ సంవత్సరం విడుదలైన స్మార్ట్ ఫోన్లలో మేటి ఫోన్ ఏంటో తెలుసా..?

ఈ ఏడాది.. చాలా కంపెనీలు.. రకరకాల స్మార్ట్ ఫోన్లను మనకు పరిచయం చేశాయి. వాటిలో కొన్నింటిని వినియోగదారులు విపరీతంగా కొనుగోలు చేయగా.. కొన్ని మార్కెట్లో డీలా పడిపోయాయి. అయితే.. ఈ సంవత్సరం విడుదలైన స్మార్ట్ ఫోన్లలో మేటి ఫోన్ ఏంటో తెలుసా..? ఏ ఫోన్ కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు..? టాప్ లిస్ట్ లో చేరిన ఫోన్స్ ఏమిటి..? తెలుసుకోవాలని ఉందా.. ఇంకెందుకు ఆలస్యం చదవండి.

 గూగుల్ లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన స్మార్ట్ ఫోన్ల జాబితాను  గూగుల్ తాజాగా విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1.ఐఫోన్8..

ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ యాపిల్.. ఈ ఏడాది విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ఐఫోన్8. దీని ప్రారంభ ధర రూ.64వేలు. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్లలో మొదటి స్థానం దీనికే దక్కింది. ఈ ఫోన్ కి రెండు వైపులా గ్లాస్ తో తయారుచేశారు. 12మెగాపిక్సెల్ వెనుక కమేరా సదుపాయం ఉంది. 64జీబీ, 256జీబీ వేరియంట్ లలో ఐఫోన్ 8ని విడుదల చేశారు.

2.ఐఫోన్ ఎక్స్..

యాపిల్ కంపెనీ స్థాపించి పది సంవత్సరాలు అయిన సందర్భంగా యాపిల్ విడుదల చేసిన మరో ఫోన్ ఐఫోన్ ఎక్స్. భారత్ లో దీని ప్రారంభధర రూ.89వేలు. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్లలో రెండో స్థానం దీనికి దక్కింది. 5.8 ఇంచెస్ ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో దీనిని రూపొందించారు. దీనిలో తొలిసారిగా ఫేస్ఐడీ విధానాన్ని కూడా పొందుపరిచారు. డ్యూయల్ వెనుక కెమేరా(12మెగా పిక్సెల్, 12మెగాపిక్సెల్) సదుపాయం కూడా కలదు.

3. సామ్ సంగ్ గెలాక్సీ ఎస్8...

ఇక మూడోస్థానంలో నిలిచిన ఫోన్ సామ్ సంగ్ గెలాక్సీ ఎస్8. ఈ ఫోన్లో 3300ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలదు. ఇది వైర్ లెస్ బ్యాటరీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ కెమేరా సదుపాయం కలదు. ఆండ్రాయిడ్ 7.1.1 నోగెట్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.

4.రేజర్ ఫోన్..

రేజర్ కంపెనీ తొలిసారి విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ రేజర్ ఫోన్. మొబైల్ గేమర్స్ ని దృష్టిలో ఉంచుకోని ఈ ఫోన్ ని విడుదల చేశారు. 120 హెచ్ జెడ్ రీఫ్రెష్ రేట్ సదుపాయం కలిగిన తొలి స్మార్ట్ ఫోన్ ఇది. కదులుతున్నప్పుడు ఫోటో తీసిన ఎలాంటి బ్లర్ రాకపోవడాన్నే రిఫ్రెష్ రేట్ అంటారు. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆపరేటింగ్ సిస్టమ్. 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 64జీబీ అంతర్గత స్టోరేజ్ సామర్థ్యం కలదు.

5. ఒప్పో ఎఫ్5..

ఒప్పో కంపెనీ ఈ సంవత్సరం విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్5. ఈ ఫోన్లో ఫేసియల్ రికగ్నైజేషన్ తోపాటు పలురకాల అన్ లాకింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు. 6ఇంచెస్ డిస్ ప్లే, 2.2గిగా హెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ,6జీబీ ర్యామ్,32జీబీ,64జీబీ అంతర్గత స్టోరేజీ సామర్థ్యం కలదు. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకంగా మైక్రో ఎస్ డీ కార్డు కోసం స్పెషల్ గా స్లాట్ కూడా ఉంది.

6. వన్ ప్లస్ 5..

ఈ ఏడాది భారతీయులను ఎక్కువగా ఆకట్టుకున్న ఫోన్ లలో వన్ ప్లస్ 5 ఒకటి. 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్. 6జీబీ/8జీబీ ర్యామ్, 64/128జీబీ స్టోరేజ్ సామర్థ్యం, 16+20మెగాపిక్సెల్ వెనుక కెమేరా, 16మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ నొగెట్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3300ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలవు.

7.నోకియా6..

బడ్జెట్ ధరలో నోకియా అందించిన స్మార్ట్ ఫోన్ నోకియా6. దీని ధర రూ.14,990. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్430 ప్రాసెసర్. 4జీబీ ర్యామ్..32జీబీ స్టోరేజ్ సామర్థ్యం. కావాలంటే దీనిని 128జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 16మెగాపిక్సెల్ రేర్ కెమేరా,8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలవు.
 

loader