పొలాండ్‌లో ఘటన చోటు చేసుకున్నది. దాదాపు 12 టన్నుల చాకొలేట్ లిక్విడ్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రాక్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ట్రక్‌లో ఉన్న చాకొలేట్ లిక్విడ్ అంతా నేలపాలైంది. దీంతో రోడ్డు మొత్తం చాకొలేట్ లిక్విడ్‌తో నిండిపోయింది.

రెస్నియా నుంచి స్లుప్కా వెళ్లే నేషనల్ హైవే ఏ2 మధ్యలో ఈ ఘటన చోటు చేసుకున్నది. రోడ్డు మధ్యలో ఉన్న ట్రాఫిక్ బారికేడ్‌ను ఢీకొన్న లారీ బోల్తా పడింది. ఇక.. ఆ దారి గుండా వెళ్లిన మిగితా వాహనాల టైర్లన్నీ చాకొలేట్ లిక్విడ్ మరకలతో అలాగే రోడ్డు మీద వెళ్లడంతో కొన్ని కిలోమీటర్ల వరకు ఈ చాకొలేట్ లిక్విడ్ విస్తరించింది.