ఈ రోజు ఆంధ్ర తెలంగాణాలలో పేలిన  తూటాలు

ఈ రోజు శాసనసభ జరిగిన తీరు కౌరవ సభను తలపించింది. కడపలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయి. కడపను కూడా కౌరవ సభగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.

  • ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

తెలంగాణాలోని పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రకు బదిలీచేయకపోతే సీఎంగా ప్రమాణం చేసేదిలేదని కేంద్రానికి చెప్పాను. తొలి కేబినెట్‌ సమావేశంలోనే ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్‌ ఇచ్చారు. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే కొనసాగించాలని, ఏపీని దెబ్బతీయాలని చూసినవాళ్లు అడ్రస్‌ లేకుండా పోయారు.

  • ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

బడ్జెట్‌ చూస్తే సప్త సముద్రాలు దాటూతు ఉంది... అభివృద్ధి మాత్రం కనిపించడం ఎక్కడా కనిపించలే. బడ్జెట్‌ను ఇలా పెంచి చూపిన రాష్ట్రం దేశలోం లేదు. అంతా గందరగోళం.. ప్రజలను ఆశల పల్లకిలో ఊరేగిస్తునకనారు.

  • తెలంగాణా ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి