తిట్లూ శాపనార్థాలు భజన లేకపోతే రాజకీయాలు రక్తి కట్టవు. అసలు రాజకీయాలంటేనే ఈ మూడు కలిసి తయారుచేసిన రసాయనం.ఆంధ్ర తెలంగాణలలో ఈ రోజు వినిపించిన కొన్ని తిట్లు, భజనలు.

ప్రధానిని ఉరితీయాలి : సిపిఐ నారాయణ

దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీకి ఆ పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు. ఆయన్ను ప్రజా కోర్టులో శిక్షించాలని నారాయణ డిమాండ్ చేశారు. మోదీని నడివీధిలో ఉరితీసినా తప్పులేదన్నారు.. అయిదొందల వేయి నోట్ల రద్దును నిరసిస్తూ తిరుపతిలోని ఎస్‌బీఐ పరిపాలనా భవనం ముందు సీపీఐ ఆందోళన నిర్వహించింది. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్యకర్తలు ధర్నా చేశారు. ఆయన అక్కడ ఈ మాటన్నారు.

కేసిఆర్ ముక్కు నేలకు రాయాలి:

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలని, మహాజన పాదయాత్ర ఎజెండాకు అనుకూలంగా ఉన్న పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటా మని, అడ్డదిడ్డంగా పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు.

ముక్కు నేలకురాయాలనే మాటా బాగా ప్రచారంలోకి తీసుకువచ్చింది టిఆర్ఎస్ నేత కెసిఆరే. తెలంగాణా ఉద్యమ సమయంలో ఆయన తరచు తన మీదేదీని ప్రయోగించుకునేవారు. నేను చెప్పేది తప్పయితే, ముక్కు నేలకేసి రాస్తాననే వారు. ఇపుడు ప్రతిపక్ష నాయకులందరు ఈ ముక్కు ను ఆయనే మీదే ప్రయోగిస్తున్నారు.

మా ముఖ్యమంత్రి నేమయినా అంటే సహించం :పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్‌పై అవాకులుచవాకులు పేలితే సహించేదిలేదని హెచ్చరించారు టిఆర్ ఎస్ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఆయనకు ఇంత కోపం రావడానికి కారణం, కెసిఆర్ ఢిల్లీకి వెళ్లింది నోట్ల వ్యవహారం గురించి ప్రధానితో మాట్లాడేందుకు కాదు, సొంతపనులచక్క బెట్టుకునేందుకు అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. దానికి ఆయన సమాధానం ఇది.

జగన్ అన్నింటికి అడ్డే : యనమల

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అడ్డుపడుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో తెదేపా జనచైతన్య యాత్రలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ జగన్ ని ఆయన రాష్ట్రాభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ అని నిప్పులుకక్కారు.

నిజాయితీ కోసమే హెరిటేజ్ : మంత్రి పుల్లారావు

రాజకీయాలలో నీతి,నిజాయితీల కోసం చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ ని ప్రారంభించారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అక్కడంతా పారదర్శకంగా లావాదేవీలు జరిగాయని, ఎక్కడా లోపం లేదని ,కాని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రం అన్ని లొసుగులు కనపడుతున్నాయని అన్నారు.

అవినీతి మంత్రులను కాపాడుతున్నారు : టి కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్

కేసీఆర్, కేటీఆర్ లు అవినీతి మంత్రులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జగదీశ్వర్ రెడ్డి గతంలో ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్ లో అవినీతికి పాల్పడ్డారు.

సూర్యాపేట లో ఉద్యోగాలు ఇప్పిస్తామని జగదీశ్వర్ రెడ్డి అండతో సంతోష్ అనే వ్యక్తి 60 లక్షలు వసూలు చేశారు.

కర్నె ప్రభాకర్ సంభందం లేదంటారు..సంతోష్ జగదీశ్వర్ రెడ్డి తో కలిసి ఉన్న సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయ్.

జగదీశ్వర్ రెడ్డిని తీసేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి

కేసీఆర్ కు కుటుంభం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు.

నిరుద్యోగులను మోసం చేశారు.

జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి.