ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి: ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధతో పూర్తి చేస్తారు. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భార్యతో ప్రేమగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి. పిల్లల విషయంలో కొంచెం భాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వృషభ రాశి: దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. దగ్గరి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. సోదరుల సహకారం కూడా ఉంటుంది. బంధు మిత్రులతో సంభాషణలు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సంతృప్తినివ్వవు.

మిథున రాశి:  ధన ప్రణాళికలు వేస్తారు. అనుకున్న పనులు ఆటంకాలతో పూర్తి చేస్తారు. పిల్లల విషయం బాధ్యతగా పూర్తి చేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కర్కాటక రాశి: మంచి భోజనం లభిస్తుంది. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. భూ సంబంధ పనులు ఒక కొలిక్కి వస్తాయి. అధికారులకు సంబంధించిన లాభం ఉంటుంది.

సింహ రాశి: భక్తి ప్రవచనాలు వింటారు. కట్టవలసిన సొమ్ములవి కడతారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేయవలసి ఉంటుంది. సోదరుల సహకారం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్యా రాశి : బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. వారితో ఆనందంగా గడుపుతారు. ధన ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో మెలకువలు అవసరం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

తులా రాశి:  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు కూడా వస్తాయి. కలహాలకి దూరంగా ఉండండి. అధికారుల వలన లాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృశ్చిక రాశి: దూరపు వార్తలు వింటారు. ప్రయాణాలు చేయాలన్న కోరిక కూడా ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలలో లాభం పొందుతారు. పిల్లల విషయంలో ఒక కన్నేసి ఉంచవలసి వుంటుంది. భార్య సహకారంతో లాభం పొందగలరు.

ధనూ రాశి: చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ఆలోచనలు కూడా విపరీతంగా ఉంటాయి. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

మకర రాశి:  భార్యతో అనుకూల దాంపత్యం కలదు. భార్యతో మాటల వలన కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తి చేయవలసి ఉంటుంది. పిల్లల పనులు మీకు ఆనందాన్ని ఇవ్వవు. సమస్యల పరిష్కారానికి దుర్గా పూజ చేయండి.

కుంభ రాశి: అనుకున్న పనులు లాభంతో పూర్తి చేస్తారు. కట్టవలసిన బాకీలు కట్టివేస్తారు. తండ్రి గారి సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మీన రాశి: పిల్లలతో సరదాగా గడుపుతారు. షికార్లు కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. దుర్గాదేవి ఆరాధనతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇప్పటి వరకూ ఈ