గురువారం నాటి రాశిఫలాలు

today your horoscope5
Highlights

  • గురువారం నాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి: 

అనుకున్న పనులు పూర్తిగా నెరవేరుతాయి. విందు భోజనం లభిస్తుంది. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి

వృషభ రాశి: 

అనుకున్న పనులు వాయిదా పడతాయి. సహకారం పూర్తిగా ఉంటుంది. పన్నులు కట్టవలసిన సమయం. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

  మిథున రాశి: 

అనుకున్న పనులు ఆటంకాల వలన వాయిదాలు ఏర్పడవలసి వస్తుంది. బంధు మిత్రుల కలయికలు ఏర్పడతాయి. ధనపరంగా అనవసర ఖర్చులు ఏర్పడతాయి. భార్య సహకారంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

  కర్కాటక రాశి: 

వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు వేస్తారు. తల్లి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. ఇంటికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాలను కలుగచేస్తాయి.

  సింహ రాశి:

దూరపు బంధువుల వార్తలు వింటారు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల సహకారం పొందుతారు. పిల్లల విషయంలో బాధ్యతగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

  కన్యా రాశి : 

రుణాలు చేయవలసి వుంటుంది. ధన ప్రణాళికలు వేసుకుంటారు. పని వారి సహకారం ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

  తులా రాశి:

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు శుభంగా జరుగుతాయి. అధికారులు ప్రసన్నంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలు లాభాన్నిస్తాయి.

  వృశ్చిక రాశి:

ఆశించిన పనులు నెమ్మదిగా జరుగుతాయి. దూరపు ప్రాంత వార్తలు వింటారు. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. అనవసర ఖర్చులు ఏర్పడతాయి. జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

  ధనూ రాశి: 

పనులు బాధ్యతతో పూర్తి చేయాలని కోరుకుంటారు. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

  మకర రాశి:

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. ఇంటి పనులలో శ్రద్ధ వహిస్తారు. తల్లి గారి ఆనందానికై శ్రమ పడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అనవసర ఖర్చుల నుండి జాగ్రత్త పడవలసిన సమయం.

  కుంభ రాశి: 

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధు రాకపోకలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. పని వారి సహకారం లభిస్తుంది.

  మీన రాశి: 

ధన ప్రణాళికలు వేస్తారు. పిల్లల గురించి ఆలోచిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గౌరవ ప్రాప్తి లభిస్తుంది.

 

loader