నేటి(శనివారం) రాశిఫలాలు

First Published 16, Dec 2017, 7:27 AM IST
today your horoscope
Highlights

శనివారం నాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి వారికి ; విందు భోజనం లభిస్తుంది. ఇంటికి సంబంధించిన పనులు బాధ్యతగా పూర్తి చేస్తారు. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. శుభం జరగగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభ రాశి వారికి ; భార్య సహకారం ఉంటుంది. అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. పని వారి సహకారం ఉంటుంది. విదేశాల నుంచి మంచి వార్త వింటారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధన ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాల్లో చిక్కులు కలవు.

కర్కాటక రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ పూర్తి చేయగలుగుతారు. ఇంటికి సంబంధించిన పనులు ఆనందంగా జరగగలవు. పిల్లల సౌఖ్యం చూస్తారు, ఆనందంగా గడుపుతారు. భార్యతో అనుకూలంగా మసలవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

సింహ రాశి వారికి ; అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మాతృ సుఖం చూస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు.

కన్యా రాశి వారికి ; దగ్గరి ప్రయాణాలు చేస్తారు. సోదరుల రాకపోకలు ఉంటాయి. ఇంటి పనులపై బాధ్యత చూపించవలసి ఉంటుంది. పిల్లల యెందు శ్రద్ధ అవసరం. పని వారి సహకారం ఉంటుంది.

తులా రాశి వారికి ; మనస్సు ఆనందంగా ఉంటుంది. ధన ప్రణాళికలు వేస్తారు. సోదరులతో బాధ్యతగా వ్యవహరించవలసిన సమయం. భార్యతో అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ; మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్టు జరపటానికి ప్రయత్నం చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి.

ధనస్సు రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. ధనం కోసం అప్పు చేయవలసి వస్తుంది. అనుకోని చిక్కులు ఉంటాయి. దుర్గా ఆరాధన చేయండి. అంతా మంచిగా జరగగలదు.

మకర రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దుర్గా దేవి పూజ చేయండి. అంతా మంచే జరగగలదు.

కుంభ రాశి వారికి ; అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. భూ సంబంధ పనులకు మంచి రోజు. సహచరుల సహకారం ఉంటుంది. చేయు పనులందు లాభాలు వస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. అంతా విజయవంతం అవ్వగలదు.

మీన రాశి వారికి ; చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. తండ్రి గారి ఆశీర్వాదంతో అంతా మంచే జరగగలదు. పిల్లల యెందు ప్రేమ చూపించండి. దైవ దర్శనం చేయండి.

 

loader