మంగళవారం దినఫలాలు..

మంగళవారం దినఫలాలు..

మేషరాశి.. ఈ రోజు రాజకీయాలలో వారికి విరోధులు వేసే పథకాలు ఎంతో ఆందోళన కలిగిస్తాయి.స్త్రీలపై పొరుగువారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. స్కీంలు, వాయిదాల పద్ధతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు.సుబ్రమణ్యస్వామి గుడి దర్శనం చేయండి. 

వృషభరాశి..  ఈ రోజు మీ ఉన్నత స్థితిని చూసి ఓర్వలేనివారు అధికమవుతున్నారు అని గమనించండి.వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం.ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి.చిన్నతరహా పరిశ్రమల్లో వారికి విద్యుత్ లోపం వల్ల దుబారా నివారించలేకపోవడం వల్ల అశాంతి అధికం అవుతుంది.వేంకటేశ్వరుని దర్శిoచండి.

మిథునరాశి..

ఈ రోజు దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.రాజకీయనాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు.తలపెట్టిన పనుల్లో స్పల్వ ఆటంకాలు,చికాకులు ఎదుర్కొంటారు.పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఏకాగ్రత ముఖ్యం.నాగదేవత పూజ మేలు చేస్తుంది. 

కర్కాటక రాశి..

ఈ రోజు ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.సహకార సంఘాల్లో వారికి ప్రైవేటు సంస్థల్లో వారికి ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. వైద్యులకు ఏకాగ్రత అవసరం.ఒక్కోసారి అతిమొండివైఖరి అవలంభించడం వల్ల అపవాదులు ఎదుర్కొంటారు. జాగ్రత్త వహించండి.నవగ్రహ ప్రదక్షిణ వల్ల అనుకూలం.

సింహరాశి..

ఈ రోజు మీ శక్తిసామర్థ్యాలపై విశ్వాసం సన్నగిల్లుతుంది. రుణాలు, చేబదుళ్లు స్వీకరించవలసి వస్తుంది.స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది.పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం.తలపెట్టిన పనులు ఆర్థాంతరంగా ముగిస్తారు.గణపతిని పూజించండి శుభం కలుగుతుంది.

కన్యారాశి..

ఈ రోజు రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనూకూలిస్తాయి.కొంతమంది మిమ్మలను నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరాలెదుర్కొంటారు.ఎంతో కొంత పొదువు చేయాలన్న మీయత్నం ఫలించదు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు కలిసివస్తుంది.విష్ణు సహస్రనామ స్తోత్రము చదవండి.

తులరాశి..

ఈ రోజు ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ది.వృత్తులు, కార్మికులు, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.ఉపాధ్యాయులకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. స్త్రీలు, దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల విదేశాల్లో పై చదువుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. పేదవారికి ఆకలి తీర్చడం వలన మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి..

ఈ రోజు ఇంజనీరింగ్ రంగాల్లో వారికి, బిల్డర్లకు ఒత్తిడి, చికాకు అధికం అవుతుంది వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారికి పనిభారం అధికమవుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి రాగలవు.మీ సంతానపై చదువుల విషయమై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సమస్యలను ఆత్మీయులకు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.నిరంతరం మనస్సులో భగవన్నామ స్మరణతో ఉండండి శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి..

ఈ రోజు ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది.ఆర్థిక విషయాల్లో కొంతమేరకు పురోగతి సాధిస్తారు. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. నూతన వ్యాపారాలు, ఉపాధి పథకాల్లో అనుభవం గడిస్తారు.తారాక మంత్రం చదవండి.

మకరరాశి..

ఈ రోజు రాజకీయ రంగంలోని వారికి ఆరోగ్యంలోపం, అధిక శ్రమ ఉంటాయి. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసివస్తాయి. అపార్థాలుమాని ఇతరులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. సోదరీ, సోదరులతో సంబంధబాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు.హనుమాన్ దర్శనం వలన శుభం కలుగుగును.

కుంభరాశి..

ఈ రోజు రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. ఇతరులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోనూ అప్రమత్తత అవసరం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.రావిచెట్టు ప్రదక్షిణ వలన లాభం.

మీనరాశి..

ఈ రోజు పత్రిక, వార్తా సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఎదుటివారు చెప్పేది జాగ్రత్త విని మీ ఆలోచనలను తగిన విధంగా మలుచుకోండి.నూతన పరిచయాలేర్పడతాయి. అర్థాంతరంగా నిలిపివేసే పనులు పూర్తి చేస్తారు.నవగ్రహ ప్రదక్షిణ వల్ల అనుకూలం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page