మేషం

మేషం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ సహోద్యోగుల లేదా పై అధికారుల పశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, పదోన్నతి విషయంలో శుభవార్త వింటారు. జీవిత భాగస్యామితో వివాదాలు సమసి పోతాయి.

వృషభం

వృషభం : ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కళ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం భారీన పడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వలన అసహనానికి, ఉదేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి పయత్నించండి. ఏ నిర్ణయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవటం మంచిది.

మిథునం

మిథునం : ఈ రోజు చాలా ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమితులను కలుసుకోవటం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. మీ ప్రేమను వ్యక్తం చేయటానికి అనువైన రోజు. బహుమతులు అందుకుంటారు. మీరు చేసిన పనికి గుర్తింపు వస్తుంది.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది. మీ స్నేహితులను కలుసుకుంటారు. గృహసంబంధ లావాదేవీలు పూర్తవుతాయి. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు.

సింహం

సింహం : ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆహారం కారణంగా ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే నిద్రలేమి కారణంగా మానసిక పశాంతత ఉండదు. అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వాహనం కొనుగోలు చేస్తారు.

కన్య

కన్య : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవటం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది. పనులకు అడ్డకులు ఏర్పడే అవకాశముంది.

తుల

తుల : ఈ రోజు మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపార ఒప్పందాలు పూర్తి చేయటం కానీ, నూతన వ్యాపారం ఆరంభించటం కానీ చేస్తారు.

వృశ్చికం

వృశ్చికం : తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సమాజంలో గౌరవం, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి ఉంటుంది. విదేశీయానానికి, పెట్టుబడికి సంబంధించి కానీ ఒక జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధనుస్సు : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. సంతానం వృద్ధిలోకి వస్తారు. వారి కారణంగా ఆనందం పొందుతారు.

మకరం

మకరం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. 

కుంభం

కుంభం : ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడతారు.

మీనం

మీనం : ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా పయత్నం మానకండి. కొద్ది శ్రమతో వాటిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.