ఒక గ్రాము మాంసకృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదనేది ‘ప్రోటీన్‌ ఎఫిషియెన్సీ రేషియో’ అంటారు. ఇది కూడా గుడ్డుకే ఎక్కువ. అందువల్ల ఎదిగే పిల్లలకు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది
ఈ ప్రపంచంలో మంచి రుచికరమైన, సురక్షితమైన, పోషకాలు కలిగి ఉండి.. చవకగా దొరికే ఆహారం ఏదైనా ఉందా అంటే.. గుడ్డు అని చటుక్కున చెప్పేయవచ్చు. పట్టుమని 50గ్రాములు కూడా ఉండని ఈ గుడ్డులో ఏన్నో పోషక గుణాలు ఉన్నాయి. రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తున్న ‘గుడ్డు’ దినోత్సవం ఈరోజు. అదేనండి ఎగ్ డే.
ప్రతి సంవత్సరం అక్టోబర్ లో రెండో శుక్రవారాన్ని"ప్రపంచ గుడ్డు దినోత్సవం"(World Egg Day) గా జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ (EIC) 1996 లో వియన్నా లో జరిగిన అన్ని దేశాల ప్రతినిధుల సదస్సులో లో ‘ఎగ్ డే’ను ప్రకటించింది.
ఒక గ్రాము మాంసకృత్తులు శరీరానికి ఎంత బరువు ఇవ్వగలదనేది ‘ప్రోటీన్ ఎఫిషియెన్సీ రేషియో’ అంటారు. ఇది కూడా గుడ్డుకే ఎక్కువ. అందువల్ల ఎదిగే పిల్లలకు గుడ్డు బాగా ఉపయోగపడుతుంది

*సంపూర్ణ ఆహారం,కార్బోహైడ్రేట్ లు బాగా తక్కువగా ఉంటాయి.
*తెల్లసోనాలో "ఆల్బుమిన్" అనే ప్రొటీన్.ఎల్లో సోనాలో "కోలెస్టిరాల్" అనే క్రోవ్వు ఉంటుంది.
* గుడ్డు సోనలో 300 మైక్రో గ్రాముల కోలిన్ అనే పోషక పదార్ధం ఉంటుంది. ఇది మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
*గుడ్ల ఉత్పతిని పెంచేందుకు ఉద్దేశించినది రజత విప్లవం(Silver Revolution)
*కోడి గుడ్డు పోదిగే కాలం 21 రోజులు.

*గుడ్ల కోసం పెంచే కోళ్ళను "లేయర్స్" అంటారు.
* మాంసం కోసం పెంచే కోళ్ళను "బాయిలర్స్" అంటారు.
*కోళ్ళు చలికాలంలో గుడ్లు ఎక్కువగా పెడతాయి.
*విటమిన్ 'C' తప్ప మిగతా అన్ని విటమిన్లు ఉంటాయి.
*కోడిగుడ్డు పెంకులొ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది.
*ప్రతి భారతీయుడు సగటున తినేవి ఏడాదికి 43 గుడ్లు మాత్రమే. అదే జపనీయులైతే 346 గుడ్లు లాగించేస్తున్నారు. మెక్సికన్లైతే 306,చైనీస్ అయితే 312 తింటున్నారు.
*కనీసం ఏడాదికి 180 గుడ్లు తిన్నా పరవాలేదని ఎన్ఐఎన్ చెబుతోంది.
గుడ్డులోని పోషక పదార్ధాలు:
* నీరు-38.8 గ్రా
*శక్తి-78 కేలరీలు
*ప్రొటీన్లు-6.5గ్రా
*క్రొవ్వు-5.8గ్రా
*సోడియం-72 మిగ్రా
*పొటాషియం-6.7 మిగ్రా
