3 జనవరి 2018 బుధవారం నాటి రాశిఫలాలు

First Published 3, Jan 2018, 10:16 AM IST
today wednesday your horoscope
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి: దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాల వల్ల లాభం కూడా చేకూరుతుంది.

వృషభ రాశి:  సోదరుల రాకపోకలు ఉంటాయి. దూరపు ప్రాంత బంధువుల వార్తలు వింటారు. పని వారి సహకారం ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి:  మంచి భోజనం లభిస్తుంది. పిల్లలతో కలసి షికారులు చేస్తారు. భార్య విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి:  మనస్సు ఆధ్యాత్మిక ప్రసంగాల వైపు ఉంటుంది. పిల్లలు వారి పనులు వారు చూసుకోవటం వలన మీకు ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల మెప్పు కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

సింహ రాశి:  దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. భగవంతుడి దర్శనం కలుగుతుంది. పిల్లలను జాగ్రత్తగా గమనించవలసిన సమయం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి :  వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. పనివారు జాగ్రత్తగా పని చేయగలరు. వ్యాపారం అభివృద్ధిలో నడుస్తుంది.

తులా రాశి: తండ్రి గారి సహకారం పొందవలసిన రోజు. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. దూర ప్రాంత బంధువుల కలయికలు, మాటలు ఉంటాయి. అధికారుల దర్శనం కూడా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి:  కొత్త అవకాశాలందు కోప తాపాలకి తావు ఇవ్వకండి. చేయు పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంది. దైవ దర్శన ప్రాప్తితో అంతా మంచి జరగగలదు. భార్య సహకారం కూడా ఉంటుంది.

ధనూ రాశి:  ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. భార్య సహకారంగా మసులుకోగలదు. పిల్లలు వారి పనులు వారు చేయటం వలన మీకు ఆనందం కలుగుతుంది. ఆనందం కోసం దుర్గా పూజ చేయండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి:  చేయు పనులందు ఆటంకాలు, వాయిదాలు పడతాయి. బాకీదారులు వసూలు చేసుకుంటారు. కొత్త అవకాశాల విషయంలో జాగ్రత్తగానే ఉండాలి. వృత్తి వ్యాపారాలు బాగానే సాగుతాయి.

కుంభ రాశి:  పిల్లలతో ఆనందంగా గడుపుతారు. షికార్లు కూడా చేస్తారు. పని వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అధికారుల సందర్శనం ఉంటుంది. తండ్రి గారి సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీన రాశి:  ఇంటికి సంబంధించిన పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు. తల్లి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు. పిల్లల విషయంలో జాగ్రత్తగా కనిపెట్టవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. దుర్గా దేవి ఆరాధన చేయండి. అంతా మంచిగా జరగగలదు.
 

loader