బుధవారం నాటి రాశిఫలాలు

First Published 20, Dec 2017, 7:23 AM IST
today wednesday your horoscope
Highlights

ఈ రోజు మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషరాశి

తండ్రి గారి ఆశీర్వాద బలం ఉంటుంది. భార్య సహకారంతో అన్ని పనులూ పూర్తి చేస్తారు. తలచిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు భాగ్యం కలుగచేస్తాయి. 

వృషభరాశి

కొన్ని అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. చేయు పనులందు ఆటంకాలు కూడా ఉంటాయి. మీ కింది పని వారి సహకారం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

మిథునరాశి

ధనానికి ఇబ్బంది ఉంటుంది. పిల్లలు వారి పని భాధ్యతగా పూర్తి చేస్తారు. తలచిన పనులు వాయిదా పడతాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

కర్కాటకరాశి

ధన ఇబ్బందులు ఉంటాయి. ఇంటికి సంబంధించిన పనులు శ్రద్ధగా చేయవలసి ఉంటుంది. పిల్లలు ఆనందాన్ని కలుగచేస్తారు. తలచిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

సింహరాశి

దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరులు సహకారంగా మసలగలరు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కూడా ఉంటుంది. భార్య సహకారంగా మసలగలదు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి.

కన్యారాశి

ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు. ధన ప్రణాళికలు వేస్తారు. పని వారి సహకారం మెండుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఒక మాదిరిగా ఉంటాయి.

తులరాశి

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. సోదర రాకపోకలు ఉంటాయి. భార్య అనుకూలంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

వృశ్చికరాశి

ధన ప్రణాళికలు కార్య రూపం దాలుస్తాయి. రావాల్సిన సొమ్ము మీ చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు భోజనం చేస్తారు. దైవ దర్శన ప్రాప్తి ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగా జరుగుతాయి.

ధనస్సురాశి

మనస్సు శాంతిగా ఉన్నప్పటికీ కొంత అశాంతి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ధనానికి కొంత కాలం పడుతూ ఉంటుంది. సోదరులు, మిత్రుల దగ్గర సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరరాశి

భక్తి ప్రవచనాలు వింటారు. చేయు పనులన్నీ వృథాగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి.

కుంభరాశి

కింద పని వారి సహకారం ఉంటుంది. భార్య సహకారం పొందుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి.

మీనరాశి

దైవ దర్శన ప్రాప్తి ఉంటుంది. ఆలస్యమయినప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆనందాన్ని ఇస్తాయి. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

  

 

loader