మేషం
కొత్త ప్రాజెక్టుల నిబద్దతను అధ్యయనం చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి ఉండదు. నిర్మాణ రంగాల వారికి పురోభివృద్ధి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.

వృషభం
రియల్ ఎస్టేట్‌లో పెట్టబడులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య ఆందోళనకు కారణమవుతుంది. సన్నిహితులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆర్థిక ఒడిదొడుకుల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. బంధు మిత్రులతో బాంధవ్యాలు మెరుగుపడతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి అనుకూలమైన కాలం.

మిథునం

చిరకాలంగా ఎదురుచూస్తోన్న పనులు పూర్తిచేస్తారు. ఇతరులను మీ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు లాభదాయకంగా ఉంటుంది. మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రత్యర్థుల తీరును గమనించి నడుచుకోవాలి. ఇతరులను వాహనం నడిపి సమస్యల్లో చిక్కుకుంటారు.

కర్కాటకం
లౌక్యంగా వ్యవహరించి పనులు చక్కబెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించాలి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాల ఆశయం నెరవేరుతుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి పెరుగుతుంది.

సింహం
కోరుకున్న వాటిని సాధించడానికి వ్యక్తిగత సంబంధాలను వాడి ఇబ్బందులకు గురవుతారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉమ్మడి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చిరు వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు రాబడికి మించినా ఇబ్బందులు ఉండవు.

కన్య
పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. గతంలో వాయిదాపడిన పనులు పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. బంధువుల రాకతో సందడి నెలకుంటుంది. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒప్పందాలు, హామీల విషయంలో పునరాలోచన అవసరం. బ్యాంకు వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు.

తుల
ప్రయాణాలు వల్ల ప్రయోజనం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత విషయంలో ఇతరుల జోక్యం అధికమవుతుంది. ఆర్థిక ఒడిదొడుకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. రవాణా, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు మార్పులు అనుకూలిస్తాయి.

వృశ్చికం
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బహుకాలంగా వాయిదాపడిన బాకీలు చెల్లిస్తారు. భావోద్వేగాలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులు అత్యుత్సాహం వల్ల సమస్యలకు గురవుతారు. పత్రికా రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయం ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి.

ధనస్సు
ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎంపిక చేసుకున్న కార్యక్రమాలు అంచనాలకు మించి లబ్ది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సలహా పాటించి మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు ఇతరులతో సంభాషించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

మకరం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో చిన్నారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాటలను పొదుపుగా వాడాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కేటరింగ్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. విదేశీయ వస్తువుల పట్ల మహిళలకు మోజు పెరుగుతుంది. బాధ్యతల అధికమవడంతో అసహనానికి గురువుతారు. అశ్రద్ధ కారణంగా ఉద్యోగులు మాటపడక తప్పదు. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి.

కుంభం
భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో కలిసి పనులు సమీక్షిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల విషయాలలో అతిగా స్పందించి అభాసుపాలయ్యే ఆస్కారం వుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి.

మీనం
గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. లీగల్ వ్యవహారాలపై లాయర్లను సంప్రదించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. వ్యాపారులు కొత్త పథకాలు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటాయి. దైవ దర్శనాలకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. పిల్లల కోసం ధనం అధికంగా ఖర్చుచేస్తారు.