16జనవరి 2018 మంగళవారం నాటి రాశిఫలాలు

First Published 16, Jan 2018, 10:25 AM IST
today tuesday your horoscope16
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి: అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేయవలసి ఉంటుంది. బంధు మిత్రులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాలు కూడా బాగా ఉంటాయి. తల్లి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ జీవిత భాగస్వామితో నెమ్మదిగా మెలగవలసి ఉంటుంది.

వృషభ రాశి:  తండ్రి గారి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. కొన్ని అవకాశాలు చేజారే అవకాశం ఉంది. కోప తాపాలకు దూరంగా ఉండండి. దూరపు బంధువుల సంభాషణలు వింటారు.

మిథున రాశి: అనుకున్న పనులు బాధ్యతగా చేయవలసి ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. ధనానికి ఇబ్బందులున్నాయి. పిల్లలు అభివృద్ధి పథంలో నడుస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

కర్కాటక రాశి: అనుకున్న పనులు ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా మెలగుతారు. కొత్త అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సోదరుల సహకారం లభిస్తుంది. పిల్లలతోనూ, కుటుంబ సభ్యులతోనూ ఆనందంగా గడుపుతారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. బంధువుల వార్తలు వింటారు.

కన్యా రాశి : ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పిల్లల అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ప్రయాణాలలో మెలకువ అవసరం.

తులా రాశి:  అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్న ప్రయాణాలు చేయవలసి వుంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

వృశ్చిక రాశి: ధన ప్రణాళికలు అనుకూలించే రోజు. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అధికారులు ప్రసన్నం అవుతారు. దూరపు బంధువుల వార్తలు వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు.

ధనూ రాశి:  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు. బంధు మిత్ర కలయికలు ఉన్నాయి. ధనం కోసం ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకున్న లాభాన్ని తెస్తాయి.

మకర రాశి: ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు.

కుంభ రాశి:  అనుకున్న పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయికలు ఏర్పడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది.

మీన రాశి:  చేయు పనులందు ఆటంకాలున్నాయి. బరువు బాధ్యతలతో చేయవలసి ఉంటుంది. బంధుమిత్రుల కలయికలు ఉన్నాయి. వారితో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపార ప్రణాళికలు అనుకూలిస్తాయి. 

 

loader