గురువారం నాటి రాశిఫలాలు

today thursday your horoscope
Highlights

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

మేషరాశి..

వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రణాళికలు వేస్తారు. భార్య సహకారంతో ప్రణాళికలు పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. పిల్లలు పెద్దల మాట మేరకు నడుస్తారు. భూ సంబంధ కార్యక్రమాలు అనుకూలిస్తాయి.

వృషభ రాశి:

దూరపు బంధువుల వార్తలు వింటారు. పని వారి సహకారం ఉంటుంది. పిల్లలు వారి పనులను పూర్తి చేస్తారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండగలవు.

మిథునరాశి..

తలచిన పనులందు ఆటంకాలు ఉంటాయి. కొత్త అవకాశాలు చేజారే సమయం. ధనానికి కొంత కొరత ఉంటుంది. పిల్లలతో ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకరాశి..

అనుకున్న పనులు భార్య సహకారంతో పూర్తి చేస్తారు. ఇంటి పనులు పూర్తి చేస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి.

సింహరాశి..

దైవ దర్శన ప్రాప్తి కలదు. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కన్యారాశి..

పిల్లలు అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారు. ధన ప్రణాళికలు పట్టుదలగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో మెలకువ అవసరం. పనివారి సహకారం ఉంటుంది. సోదరుల సహకారం, మిత్రుల సహకారంతో వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

తులరాశి..

చేయు పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. సోదరులు అనుకూలిస్తారు. తల్లి గారిని ప్రేమగా చూసుకుంటారు. వారి అవసరాలను తీరుస్తారు. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

వృశ్చికరాశి..

దగ్గరి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. దైవ దర్శన ప్రాప్తి ఉంటుంది. దూర వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలలో ధనం చేకూరుతుంది.

ధనస్సు రాశి..

అనుకున్న పనులు నెరవేరతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. సోదరుల, మిత్రుల సహకారం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకరరాశి..

ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. అనుకున్నవి జరుగుతాయి. విందు భోజనం లభిస్తుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు పట్టుదలగా పూర్తి చేస్తారు.

కుంభరాశి..

ఆధ్యాత్మిక ప్రసంగాలు వింటారు. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. పని వారి సహాయ సహకారాలు కూడా ఉంటాయి. భూ సంబంధ లావాదేవీలకు శుభ పరిణామం. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

మీనరాశి..

చేయు పనులందు ఆటంకాలు ఉంటాయి. బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. భార్య సహకారంగా మసులుకోగలదు. వృత్తి వ్యాపారాలను బాధ్యతతో చేయవలసి ఉంటుంది.

 

loader