నేటి( గురువారం) రాశిఫలాలు

today thursday your horoscope
Highlights

  • ఈ రోజు మీ రాశి ఫలాలు

మేషరాశి..

ఈ రోజు బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి.ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి కానరాదు. కలప, ఇటుక, ఇసుక వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు.నిరంతరం మనస్సులో భగవన్నామ స్మరణతో ఉండండి శుభం కలుగుతుంది.

వృషభరాశి :-

ఈ రోజు విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. బంధు మిత్రులతో సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.ఆర్థిక ఒడిదుడుకుల వలన చికాకులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లోని వారికి కలిసివచ్చే కాలం.ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మెళకువ వహించండి. రావిచెట్టు ప్రదక్షిణ వలన లాభం కలుగుతుంది.

మిథునరాశి :-

ఈ రోజు ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి.నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు లాభదాయకంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.ఇతరుల వలన కొన్ని విషయాలలో ఇబ్బందులకు గురవుతారు.సహనం పాటించండి.పక్షులకు ధాన్యపు గింజలు వేయంది.

కర్కాటకరాశి :-

ఈ రోజు దూర ప్రయాణాల ఆశయం నెరవేరుతుంది. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగస్తులకు సదావకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేరు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యం అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు కొలిక్కి వస్తాయి.నాగదేవత పూజ మేలు చేస్తుంది.

సింహరాశి :-

ఈ రోజు రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రాబడికి మించిన ఖర్చులున్నా ఇబ్బందులు అంతగా వుండవు.ఉమ్మడి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు కలిసివస్తుంది.హనుమాన్ చాలీసా చదవండి.

కన్యరాశి :-

ఈ రోజు చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒప్పందాలు, హామీలకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన అవసరం. బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు.బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. అసాధ్యమనుకున్న ఒక వ్యవహారం మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.ఆవునకు ఆహరంగా ఏదైన తినిపించండి.

తులరాశి :-

ఈ రోజు రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి.రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు.పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. పేదవారికి ఆకలి తీర్చడం వలన మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి :-

ఈ రోజు ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది.బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి.విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. పత్రికా రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేయండి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.నవగ్రహ ప్రదక్షిణ వల్ల అనుకూలం.

ధనస్సురాశి :-

ఈ రోజు ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. రాజకీయనాయకులకు ఇతరులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం.బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి.ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. గణపతిని పూజించండి శుభం కలుగుతుంది.

మకరరాశి :-

ఈ రోజు స్త్రీలకు విదేశీయ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. తలకు మించిన బాధ్యతలతో తలమునకలౌతుంటే కాస్త ఓపిగ్గా వ్యవహరించండి.కేటరింగ్ రంగాల్లో పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఉద్యోగస్తులకు అశ్రద్ధ, జాప్యం వల్ల మాటపడక తప్పదు.సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి.సుబ్రమణ్యస్వామి గుడి దర్శనం చేయండి.

కుంభరాశి :-

ఈ రోజు ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లకు అధికారులు, పనివారలతో సమస్యలు ఎదురవుతాయి.సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారం వుంది. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి.హనుమాన్ దర్శనం వలన శుభం కలుగుగును.

మీనరాశి :-

ఈ రోజు వైద్య, ఇంజనీరింగ్ రంగంలో వారికి మెళకువ అవసరం. సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.ఉద్యోగస్తుల ఏమరుపాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది.వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలు,ప్రణాళికలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.విష్ణు సహస్రనామ స్తోత్రము చదవండి.

 

loader