మేషం
కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. పెట్టుబడుల వల్ల ఆర్థికంగా లబ్ది పొందుతారు. ప్రయాణాల వల్ల కొంత అసౌకర్యం తప్పదు. వ్యాపారవర్గాలు కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

వృషభం
అదనపు సంపాదన దిశగా ఆలోచనలు సాగుతాయి. బంధువులు, స్నేహితుల నుంచి ఊహించని కానుకలు అందుతాయి. జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. మహిళలకు కొత్త పరిచయాలు అధికమవుతాయి. కిందిస్థాయి వారితో దురుసుగా వ్యవహరించి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి.

మిథునం

సురక్షితమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అనుకూలిస్తాయి. ఇతరుల విజయాలను చూసి సంతోషిస్తారు. చుట్టూ ఉన్నవారి ప్రేమను పొందుతారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలలో అంనాలు తారుమారవుతాయి. మహిళలకు అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఆటంకాలు ఏర్పడతాయి. సౌమ్యమైన ప్రవర్తనతో ఎదుటివారిని ఆకర్షిస్తారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం
కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు సందిగ్దంలో పడేస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. చేతి వృత్తుల వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. లీగల్ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. రక్త సంబంధీకులతో అప్రమత్తంగా ఉంటారు. విలువైన గృహోపకరణాల కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రియమైన వారికి విలువైన వస్తువులను అందజేస్తారు.

సింహం
హామీలు, వాగ్దానాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల్లో లోపాలను ఎత్తిచూపి విమర్శలకు గురవుతారు. ఉపాధ్యాయులకు విమర్శలు ఎదురవుతాయి. లాయరకు ఇబ్బందులు తప్పవు. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గతంలో చేసిన సహాయం వల్ల గౌరవం పొందుతారు.

కన్య
ఆర్థిక లబ్ది ఆలస్యమవుతుంది. క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో ఊహించని చికాకు లెదురవుతాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు కావడంతో పనులు పునఃప్రారంభమవుతాయి. ఉద్యోగులకు ఒత్తిడి, పనిభారం తప్పదు.

తుల
ఖర్చులు పెరగడంతో పొదుపు చేయాలన్న సంకల్పం నెరవేరదు. వ్యక్తిగత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. క్లిష్ట సమయంలో జీవిత భాగస్వామి తోడుగా ఉంటారు. ఉద్యోగులకు హోదాతోపాటు బాధ్యతలు పెరుగుతాయి. రుణ విముక్తులవుతారు. మహిళల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. భాగస్వామిక ఒప్పందాలు, లీజు వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. వాహనం నడిపేటప్పడు అప్రమత్తంగా ఉండాలి.

వృశ్చికం
అశ్రద్ధ వల్ల కొన్ని నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. రాజకీయ నాయకులు సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ప్రియమైనవారి మాటలు అసహనం కలిగిస్తాయి. ధనంలో కొంత మొత్తం అందుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల మొండివైఖరి చికాకు కలిగిస్తుంది.

ధనస్సు
పెట్టుబడులు, ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. కళ రంగాల్లో మహిళలు రాణిస్తారు. కొత్త వ్యాపారాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. అతిథులను ఆకట్టుకుంటారు. కొన్ని సంఘటనలు ఇబ్బంది కలిగిస్తాయి.

మకరం
ఇతరులక కోసం అతిగా ఖర్చుచేసే స్వభావం తగ్గించుకోవాలి. కుటుంబంలోకి కొత్త వ్యక్తి రాక సంతోషానికి కారణమవుతుంది. కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. వాహనం, విలువైన వస్తువులు మరమ్మతులకు గురయ్యే ఆస్కారం ఉంది. ప్రముఖులు, ఆత్మీయులను కలుసుకుంటారు. ప్రయాణాల్లో ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. 

కుంభం
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోవడంతో ప్రశాంతంగా ఉంటారు. కొందరు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. మీడియా రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురువుతాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కోపాన్ని ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు.

మీనం
తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు అనుకూలిస్తాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వైవాహిక జీవితంలో మాత్రం సమస్యలు ఎదురువుతాయి. జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలలో కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.