ఆదివారం నాటి రాశిఫలాలు

First Published 31, Dec 2017, 8:35 AM IST
today sunday your horoscope
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం

ఈ రోజు ఎక్కువ సమయం ఏ పని చేయకుండా బద్ధకంగా గడుపుతారు. అనుకున్న పనులు వాయిదా వేసి విశ్రాంతి కోరుకుంటారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. అలాగే ఇతరుల వ్యవహారాల్లో ఓపిక అవసరం. గృహ సంబంధ లావాదేవీల్లో తొందరపాటు పనికి రాదు.

వృషభం

ఈ రోజు ఎక్కవ సమయం ఉల్లాసంగా గడుపుతారు. ఎక్కువ సమయం వ్యక్తిగత పనులకు కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రులను కలుస్తారు.

మిథునం

ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి అంతగా అనుకూలమైన రోజు కాదు. చేపట్టిన పనులు కూడా మధ్యలో మానేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.

కర్కాటకం

ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు, ఒప్పందాలు పూర్తి చేస్తారు. పెట్టుబడుల్లో అజాగ్రత్త, తొందరపాటు పనికి రాదు. మీ శత్రువుల విషయంలో అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు.

సింహం

ఈ రోజు చేపట్టిన పనులు శ్రమతో పూర్తి చేయాల్సి వస్తుంది. పని ఒత్తిడి అధికంగా ఉండటం కారణంగా అలసట కు గురయ్యే అవకాశం ఉంటుంది. సరైన ఆహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది.
కన్య

మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొద్దికాలంగా ఇబ్బందిపెడుతున్న సమస్య ఒక కొలిక్కి వస్తుంది. ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

తుల

ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కొద్దికాలంగా ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. వృత్తి పరంగా ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి రోజంతా ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సహాయం లభిస్తుంది.

వృశ్చికం

ఈ రోజు మీ వృత్తి విషయంలో అనుకూల మైన మార్పు చోటు చేసుకోవడం కానీ, అనుకూలమైన వార్త వినడం కానీ జరుగుతుంది. విదేశి సంబంధ వ్యవహారాలు పూర్తవుతాయి. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పను లు మీ జీవిత భాగస్వామి సహాయంతో విజయవంంగా పూర్తి చేయ గలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ అనారోగ్యాల కారణంగా ఇబ్బంది పడే అవకాశముంది.

మకరం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో ఉన్న మనస్పర్థలు తొలగి పోతాయి. మీ ప్రేమను వ్యక్తం చేయగలుగుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చే స్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ సృజనాత్మకత ప్రశంసంలు పొందుతుంది.

కుంభం

ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. నేత్ర సంబంధ అనారోగ్యం కానీ, మానసిక ఆందోళన కానీ ఉంటుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం మంచిది కాదు. మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తారు. సంగీతం వినడం లేదా ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొనటం మంచిది.

మీనం

ఈ రోజు ప్రయాణాలకు, నూతన మార్పులకు, వాహన కొనుగోళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలకు, సృజనాత్మతకు ప్రశంసలు లభిస్తాయి.

loader