నేటి(ఆదివారం) రాశిఫలాలు

First Published 24, Dec 2017, 9:12 AM IST
today sunday your horoscope
Highlights
  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం..

ఆనందదాయకంగా ఫలితాలుంటాయి. మనోబలంతో ఉద్యోగంలో విజయం సాధిస్తారు. సంకల్పసిద్ధి ఉంది. అధికారుల ప్రశంసలున్నాయి. ఆర్థికంగా మిశ్రమకాలం. ఏకాగ్రతతో ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇబ్బందిపెట్టే వారున్నారు. తెలివిగా సమాధానం ఇవ్వాలి. గృహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దత్త దర్శనం మేలు చేస్తుంది.

వృషభం..

పరిస్థితులు సహకరిస్తాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు అనుకున్నట్టుగానే వస్తాయి. చంచలత్వం రానీయవద్దు. ఒత్తిడిని జయించాలి. దగ్గరివారి నుంచి సహకారం అందుతుంది. ఆస్తిపరంగా శుభకాలం. ఆటంకాలను అధిగమిస్తారు. గౌరవప్రదమైన జీవితం కొనసాగిస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
మిథునం

పనుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆపదలున్నాయి. పొరపాటు జరిగితే పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. శత్రువులు పొంచి ఉన్నారు. బుద్ధిబలంతో మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు. కీర్తి ప్రతిష్ఠలు సంపాదిస్తారు. సూర్యుడికి నమస్కారం చేసుకోండి.
కర్కాటకం..

సొంత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. పక్కనే ఉండి తప్పుదోవ పట్టించేవారున్నారు. సమయానుకూలంగా వ్యవహరిస్తే సరిపోతుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. మంచి ఫలితాలు వస్తాయి. ధర్మచింతనతో ఆలోచించండి. ఆపదలు వాటంతట అవే తొలగుతాయి. కుటుంబసభ్యులతో సఖ్యంగా ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి.

సింహం..

చేపట్టే పనుల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. అదృష్టకాలం నడుస్తోంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రయత్నలోపం లేకుండా కృషిచేయండి. విమర్శించేవారున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. ఆనందంతో వ్యయం చేస్తారు. ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది.

 కన్య..

బుద్ధిబలంతో ఒక పనిలో విజయం సిద్ధిస్తుంది. గతంకంటే మంచి కాలం. నూతనంగా ప్రారంభించే పనులు కార్యసిద్ధినిస్తాయి. సౌభాగ్యవంతులు అవుతారు. అడ్డుతగిలే వారున్నారు. శాంతంగా సమాధానమివ్వండి. రుణ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వాగ్వాదాలకు అవకాశమివ్వకండి. ఆరోగ్యం జాగ్రత్త. ఆంజనేయ స్తోత్రం చదువుకోవాలి.
తుల రాశి..

పనిలో నైపుణ్యం పెరుగుతుంది. సులభంగా కార్యాలను పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సంతోషంగా కాలం గడుస్తుంది. చేయవలసిన పనులు స్పష్టమవుతాయి. తోటివారి సహకారంతో కల నెరవేరుతుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. స్వస్థానప్రాప్తి. నలుగురికీ ఉపయోగపడే పనులు చేస్తారు. ఇష్టదైవ ధ్యానం మంచి చేస్తుంది.

వృశ్చికం..

దైవబలంతో పనులు పూర్తి అవుతాయి. గట్టి మానవ ప్రయత్నం చేయాలి. ఎంత కష్టపడ్డా ఫలితం సాధారణంగానే ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. తప్పక అభీష్టం నెరవేరుతుంది. తోటివారి సహకారం కొంత తగ్గుతుంది. పాత విషయాలు అశాంతికి గురిచేస్తాయి. దైవ దర్శనాలు స్వాంతననిస్తాయి. శివారాధన ఉత్తమ ఫలితాన్నిస్తుంది.

ధనస్సు..

సకాలంలో విజయం వరిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. ఆలోచనలు సహకరిస్తాయి. గురువుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక ఎదుగుదలకు ఇది సరైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సున్నితమైన అంశాల్లో అంత లోతుగా ఆలోచించవద్దు. బంధువుల ఆదరాభిమానాలున్నాయి. లక్ష్మీధ్యానం అదృష్టాన్ని పెంచుతుంది.

మకరం..

బాగా ఆలోచించి పనిచేయాలి. తప్పు లేకున్నా ఇబ్బందిపెట్టేవారు ఉంటారు. ముఖ్యమైన విషయాల్లో తగినంత శ్రద్ధ అవసరం. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించండి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త అవసరం. సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఒక శుభవార్త వింటారు. మీవల్ల మీ దగ్గరి వారికి మేలు జరుగుతుంది. నవగ్రహ దర్శనం శక్తినిస్తుంది

కుంభం..

పరిపూర్ణమైన శుభకాలం. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు విశేష శుభాన్నిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే అధిక లాభాలొస్తాయి.  కష్టపడి పనిచేయండి. శాశ్వతమైన అదృష్టం లభిస్తుంది. సాహసంతో చేసే పనులు ప్రతిష్ఠను పెంచుతాయి. ఆర్థికంగా శుభకాలం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. సూర్య దర్శనం మంచిది.

మీనరాశి..

ఆత్మవిశ్వాసంతో విజయం లభిస్తుంది. తోటివారి సహకారంతో మంచి జరుగుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తిచేస్తారు. రావలసిన ధనం సకాలంలో వస్తుంది. మొహమాటం పనికిరాదు. చాకచక్యంగా వ్యవహరిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయి. కుటుంబసభ్యులతో అన్యోన్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో తగినంత శ్రద్ధ తీసుకోండి. సాయి ఆరాధన శుభాన్నిస్తుంది.
 

loader