నేటి(సోమవారం) రాశిఫలాలు

today monday your horoscope
Highlights

  • ఈ రోజు మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి వారికి ; దూర సంభాషణలు చేస్తారు. భార్య సహాయంతో కఠినమైన పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ప్రేమను గెలుస్తారు. పిల్లలతో షికారు చేస్తారు. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి వారికి ; తలచిన కోరికలు నెరవేరుతాయి. కొన్ని అవకాశాలు చేజారకుండా చూడాలి. పని వారి సహకారం ఉంటుంది. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. సోదర సహకారం కూడా ఉంటుంది.

మిథున రాశి వారికి ; చేయు పనులు పూర్తి చేస్తారు. ధనానికి కొరత ఉంటుంది. పిల్లలు బాధ్యతతో వ్యవరిస్తారు. భార్యతో అనుకూల దాంపత్యం కలదు. వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి.

కర్కాటక రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. కొత్త పనులు చేజారకుండా చూసుకోవాలి. ఇంటికి సంబంధించిన పనులన్నీ చూస్తారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి వారికి ; పిల్లల అవసరాలు అన్నీ చూస్తారు. దగ్గరి బంధువుల రాకపోకలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు. ఇంటికి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ; గృహ అవసరాలు తీరుస్తారు. పనివారి సహకారం ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

తులా రాశి వారికి ; ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. అనుకున్న పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. దగ్గరి ప్రయాణాలు కూడా చేస్తారు. సోదర కలయికలు కూడా ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ; భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. దూర ప్రాంత బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు ధనం కలుగచేస్తాయి.

ధనూ రాశి వారికి ; మనస్సు ఆనందంగా ఉంటుంది. మంచి భోజనం లభిస్తుంది. బంధు మిత్రుల సహకారం కూడా ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ; తలచిన పనులు ఆటంకాలతో వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. భార్య మాటలు అంతగా రుచించవు. కుటుంబ సభ్యులతో ఎక్కడన్నా దూరంగా కాలక్షేపం చేసి వస్తారు.

కుంభ రాశి వారికి ; బంధు మిత్రుల కలయికలు ఉంటాయి. ఇంటి అవసరాలు తీరుస్తారు. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి గారి ఆశీర్వాదం పొందండి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

మీన రాశి వారికి ; వృత్తి వ్యాపారాలు అనుకూల లాభాన్ని ఇస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేయటం మంచిది.

 

 

 

loader