Asianet News TeluguAsianet News Telugu

07 మార్చి 2018 బుధవారం మీ రాశిఫలాలు

  • ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march7th your horoscope

మేషం

మేషం:ఈ రోజు మీ మిత్రులను కలుసుకోవటం జరుగుతుంది. అలాగే ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.

వృషభం

వృషభం : ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

మిథునం

మిథునం : ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వల్ల మానసికంగా చికాకుకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.

కర్కాటకం

కర్కాటకం : మీకు ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. కడుపు లేదా ఛాతికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చ. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సంబంధ ఆరోగ్య సమస్య ఎక్కువగా బాధిస్తుంది. మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. భూ, వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి.

సింహం

సింహం : మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు.

కన్య

కన్య : ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

తుల

తుల : మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువసేపు ఇంట్లో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు.

వృశ్చికం

వృశ్చికం : ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు, ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

ధనుస్సు :

ధనుస్సు: ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావటం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

మకరం

మకరం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం

కుంభం : ఈ రోజు మీరు దూర ప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కానీ, చిన్ననాటి మిత్రులను కానీ కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు.

మీనం

మీనం : మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం.

Follow Us:
Download App:
  • android
  • ios