Asianet News TeluguAsianet News Telugu

03 మార్చి, 2018 శనివారం మీ రాశిఫలాలు

  • ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march3rd your horoscope

మేషం

మేషం: మీ ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడులు లా భిస్తాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, ప్రమోషన్ విషయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆధ్యాత్మిక కార్యకమాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. రోజంతా ఉత్సాహంగా గడుపుతారు.

వృషభం

వృషభం : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేతాల్ని సందర్శించటం కానీ చేస్తారు.

మిథునం

మిథునం : పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. ప్రశాంత చిత్తంతో అన్ని పనులు చేయగలుగుతారు.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులు, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.

సింహం

సింహం : ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్ర త్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.

కన్య

కన్య : ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అనుకూల మార్పు చోటు చేసుకుంటుంది.

తుల

తుల : బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్‌లో ఇబ్బంది పడే అవకాశముంటుంది.

వృశ్చికం

వృశ్చికం : మీరు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేర్చుకోగలుగుతారు. అవకాశాలు అందివస్తాయి. ఆరో గ్యం బాగుంటుంది, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యకమాల్లో మునిగితేలుతారు. బంధు మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు :

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభించటానికి, గతంలో ఆగిపోయిన పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. అనుకోని సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో సమస్యలు తొలగిపోతాయి. మీ శ్రమకు గు ర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

మకరం

మకరం : ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులు, నూతన లావాదేవీల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచండి. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు.

కుంభం

కుంభం : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. శ్వాస, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వచ్చే అవకాశముంటుంది. అలాగే కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. కొత్త పనులకు అనుకూలమైన రోజు కాదు.

మీనం

మీనం : ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం. వ్యాపార వ్యవహారాలు కానీ, ఇతర ఆర్థిక లావాదేవీలు కానీ అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios