Asianet News TeluguAsianet News Telugu

23 మార్చి 2018 శుక్రవారం మీ రాశిఫలాలు

  • ఈరోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
today march 23rd your horoscope

మేషం

మేషం :స్నేహితులు, బంధువులను కలుసుకుంటారు. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, ప్రయాణం కానీ చేస్తారు. విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక ముఖ్య సమాచారం తెలుస్తుంది. పనులు పూర్తిచేయగలుగుతారు.

వృషభం

వృషభం :ఈరోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పైఅధికారులను కలవటానికి అనుకూలించే దినం. అనుకోని బహుమతులు కానీ, ప్రశంసలు కానీ పొందుతారు. మీ మిత్రులు, బంధువుల సహాయం అందుకుంటారు. అనుకోని వ్యక్తులను కలుసుకుంటారు.

మిథునం

మిథునం :ఈరోజు రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. గురువులు, ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకుల కారణంగా విసుగుకు లోనవుతారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం కానీ, ఇల్లు సర్దటం కానీ చేస్తారు.

కర్కాటకం

కర్కాటకం : మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన వంటివి ఉంటాయి. మీ ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. శివున్ని పూజించండి.

సింహం

సింహం :ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవటానికి, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను, ఆప్యాయతను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల ఆరోగ్యం, విద్యా విషయంలో కొంత ఆందోళన చెందుతారు.

కన్య

కన్య : ఈరోజు వివాదాలు, భూమి సంబంధ వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూలదినం. మీమాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు.ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.

తుల

తుల : మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. అలాగే మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి చెప్పటానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. పరీక్షలు రాస్తున్నవారు విజయం సాధిస్తారు.

వృశ్చికం

వృశ్చికం : ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. సెలవు అయినప్పటికీ ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.

ధనుస్సు :

ధనుస్సు : ఈ రోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. షాపింగ్ చేయటం కానీ, మిత్రులను కలవటం కానీ చేస్తారు. అలాగే వాహన కొనుగోలు కానీ, రిపేర్ చేయించటం కానీ చేస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. అత్యుత్సాహం కారణంగా అనుకోని గొడవల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈరోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలయినప్పటికీ, అందుకు తగిన ఖర్చు పైనపడటంతో వచ్చిన డబ్బుపోతుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజుకాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. బంధువుల కారణంగా డబ్బు ఖర్చు అవుతుంది.

కుంభం

కుంభం : ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. రుచి కరమైన ఆహారం లభిస్తుంది. మిత్రులు, బంధువులతో కలిసి ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.

మీనం

మీనం : కొంత బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకు రారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరగటం లేదా వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవటం జరగవచ్చు. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మీ తల్లి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

Follow Us:
Download App:
  • android
  • ios