ఆభరణాల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధర సెన్సెక్స్ ను తలపించేలా పెరుగుతూ తగ్గుతూ వస్తోంది. గత మూడు వారాలుగా ఒడిదుడుకులకులోనైన బంగారం ధర ఈ రోజు స్వల్పంగా పెరిగింది.
పది గ్రాముల బంగారం ఈ రోజు రూ.155 పెరిగి రూ.29,880 కు చేరుకుంది. ఆభరణాల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
వెండి ధర కూడా ఇదే బాటలో వెళుతోంది. గత మూడు వారాలుగా పెరుగుతూ వస్తున్న ధర ఈ రోజు కాస్త భారీగా నే పెరిగింది. కిలో వెండి ధర ఈ రోజు ఒక్కసారిగా రూ. 400 కు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.43,450 గా ఉంది.
