నేటి రాశిఫలాలు

today friday your horoscope
Highlights

శుక్రవారం నాటి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేష రాశి..

  అనుకున్న పనులు పూర్తిగా అవుతాయి. భూ సంబంధమైన పనులకు అనుకూలమైన రోజు. తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సమయం. పిల్లలను ఒక కంటితో గమనించాలి. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృషభ రాశి..

 తలచిన పనులు పూర్తవుతాయి. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. కొత్త అవకాశాలు చేజారకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మిథున రాశి..

 తలచిన పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు. ధన ఇబ్బందులు కలవు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. సోదరులు సహకారంగా ఉండగలరు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి వారికి ; ఇంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. తల్లిదండ్రుల మన్నన పొందుతారు. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. తండ్రి గారి సహకారం లభిస్తుంది.

సింహ రాశి వారికి ; ఇంటికి కావాల్సినవి అన్నీ శ్రద్ధ వహిస్తారు. దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. పిల్లల యెందు శ్రద్ధ చూపించ వలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కన్యా రాశి వారికి ; ఆర్థిక లావాదేవీలను చూస్తారు. తలచిన పనులలో ఫల ప్రాప్తి కలదు. కొనుగోలు, విక్రయదారులకి అనుకూలమైన సమయం. లాభ నష్టాలు బేరీజు చేసుకుంటారు.

తులా రాశి వారికి ; కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు సులువుగా సాగుతాయి. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మనస్సులో నిర్ణయాలకు ప్రణాళికలు వేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

వృశ్చిక రాశి వారికి ; మనస్సు ఒత్తిడికి గురవుతుంది. భార్య సహకారంతో విజయం వైపు నిలుస్తారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూరపు ప్రయాణాలు చేయాలని ఆశిస్తారు. భార్య అనుకూలంగా మసలగలదు.

ధనూ రాశి వారికి ; చేయు పనులలో ఆటంకాలు ఉంటాయి. అన్నిటి యెందూ భాధ్యత వహించవలసి ఉంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మకర రాశి వారికి ; అధికారులు ప్రసన్నం అవుతారు. బంధు మిత్రులు కలుస్తారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా పూర్తి చేస్తారు. దుర్గా దేవి ఆరాధన చేసిన అన్నీ శుభంగా జరగగలవు.

కుంభ రాశి వారికి ; తలచిన పనులన్నిటిలో అడ్డంకులు ఉంటాయి. బాధ్యతగా చేయవలసి ఉంటుంది. దూర ప్రాంతాలు చూడాలని అనుకుంటారు. దూరపు బంధువుల సమాచారం వింటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగగలవు.

మీన రాశి వారికి ; ఆరోగ్య చిక్కులు ఉంటాయి. విశ్రాంతిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అడ్డంకులు తీరడానికి దుర్గా దేవిని పూజించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
 

loader