మేషం

మేషం : ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం.

వృషభం

వృషభం : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చు కానీ ప్రయాణాన్ని కాని చేయాల్సి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరలుతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.

మిథునం

మిథునం :ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావడం కానీ, లేదా మీ బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

సింహం

సింహం :ఈ రోజు చిన్ననాటి మిత్రలను కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు లోనవుతారు. అనుకోని ఖర్చు అవుతాయి.

కన్య

కన్య : పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహ, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి.

తుల

తుల :ఈ రోజు ఉల్లాసంగా గడుపుతారు. బంధువులను కలుసుకోవడం కానీ, చిరకాల మిత్రులను కలుసుకోవడం కానీ చేస్తారు. ప్రేమ లేదా పెళ్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంత అనుకూలత ఏర్పడుతుంది. కొత్త వస్ర్తాలు కానీ, వస్తువులను కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

వృశ్చికం :ఈ రోజు ఇంటి వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఏదైనా సమస్య, మాట పట్టింపు వచ్చే అవకాశముంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళన, అనవసర ఆవేశం ఎక్కువగా ఉంటాయి. చేపట్టిన కొన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ పూర్తి చేయగలుతారు.

ధనుస్సు

ధనుస్సు :ఈ రోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అనుకున్న పనులు ఎక్కువ శ్రమ లేకుండా పూర్తి చేస్తారు. మిత్రులు, బంధువులకు సాయం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం కానీ, లేదా ఖర్చు ఎక్కువగా ఉండడం కానీ జరుగుతంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు.

మకరం

మకరం :ఈ రోజు ఎక్కువగా ఇంట్లో గడపటానికి కానా, కుటుంబసభ్యులతో గడపటానికి ఇష్టపడుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.

కుంభం

కుంభం : ఈ రోజు ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. స్త్రీల కారణంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువులు ప్రయాణాల్లో తీసుకెళ్లకపోవడం మంచిది. గృహ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. ఎక్కువ ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనవకండి.

మీనం

మీనం :ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి మాట అని తర్వాత బాధ పడే అవకాశముంంది. ముఖ్యంగా కుటుంబసభ్యులతో , జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా ధనలాభం ఉంటుంది.