21 ఫిబ్రవరి 2018 బుధవారం మీ రాశిఫలాలు

21 ఫిబ్రవరి 2018 బుధవారం మీ రాశిఫలాలు

మేషం

అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీ స్నేహితులను కలుసుకుంటారు.

వృషభం

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కం టికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికం గా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది.

మిథునం

ఆహ్లాదకరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలవటం జరుగుతుంది. ఆర్థికంగా లాభిస్తుంది. ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆవేశానికి, అత్యుత్సాహానికి లోనయి అనవసర వివాదాల్లో తలదూర్చకండి.

కర్కాటకం

ఈ రోజు అనుకున్న పనులు తక్కువ శ్రమతో పూర్తి అవుతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.

సింహం

ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటా యి. మానసికంగా ఏదో కోల్పోయిన భావన ఉంటుంది.

కన్య

మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించ డం. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం.

తుల

మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. సంతానం కారణంగా ఆనందం పొందుతారు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

వృశ్చికం

ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శతృవులపై లేదా ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తారు. నూతన ఒప్పందాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనుస్సు

ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బువిషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం. కోపావేశాలకు లోనవటం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.

మకరం

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా ఆందోళన కలిగించే అవకాశం ఉంది.

కుంభం

ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి. అనుకోని లాభం కాని, బహుమతి కానీ అందుకుంటారు. మానసికంగా ఆందోళన ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యుల కారణంగా దాని నుంచి బయటపడ గలుగుతారు

మీనం

ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది. ఆర్థిక నియంత్రణ అవసరం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos