ఫిబ్రవరి 18 ఆదివారం 2018 మీ రాశి ఫలాలు

ఫిబ్రవరి 18 ఆదివారం 2018 మీ రాశి ఫలాలు

మేషం

ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి.

వృషభం

వృషభం : ఈ రోజు మీ ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులకు, కొనుగోళ్లకు అనుకూల దినం. అలాగే పైఅధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు మీ చిరకాల మిత్రులను కానీ, చాలాకాలంగా కలవని మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. చేసిన పనినే మళ్లీ చేయాల్సి రావచ్చు.

కర్కాటకం

ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుం ది. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడడం వల్ల చికాకులు పెరుగుతాయి. అనవసర ఖర్చు పైన పడుతుంది. వీలైనంతవరకు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. పెట్టుబడులకు కొనుగోళ్లకు అంతగా అనువైన రోజు కాదు.

సింహం

ఈ రోజు మీ స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. రుచికరమైన ఆహారం తీసుకోవడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తారు. అలాగే వాహ నం కొనుగోలు, భూసంబంధ వ్యవహారాలు కానీ పూర్తి చేస్తారు.

కన్య

ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మీ ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ, మరమ్మత్తులు చేయటం కానీ చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోయి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోకండి.

తుల

ఈరోజు మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం వల్ల మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. ఆర్థిక సంబంధ పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. మానసిక ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ సమయం వినోద కార్యక్రమాల్లో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

వృశ్చికం

ఈరోజు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయానుకూల ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

ధనుస్సు :

ఈ రోజు మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన కారణంగా మీ ఆత్మీయులను అసహనానికి గురి చేసినవారవుతారు. మీ ప్రవర్తన కారణంగా మీ పైఅధికారుల నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకండి.

మకరం

ఈ రోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా కొత్తపనులు చేపట్టినప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు లేదా వ్యవహారశైలి కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది.

కుంభం

ఈ రోజు మీ స్నేహితులతో, పరిచయస్తులతో గడపడానికి అనువైన సమయమిది. వారితో మీకున్న అభిప్రాయ భేదాలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ ప్రేమ వ్యవహారాల్లో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.

మీనం

ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చుల కారణంగా లేదా మోసపోవడం వల్ల కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. అపరిచితులను నమ్మకండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos