29 జనవరి సోమవారం 2018..మీ రాశి ఫలాలు

29 జనవరి సోమవారం 2018..మీ రాశి ఫలాలు

మేషం

మేషం : ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.

వృషభం

వృషభం : ఈ రోజు ఉద్యోగంలో, వ్యాపారంలో కానీ అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, అనుకున్న మార్పు కానీ చోటు చేసుకుంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. అలాగే పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి.

మిథునం

మిథునం : ఈ రోజు పాత మిత్రులను కానీ, దూర దేశంలో ఉన్న మిత్రులను కానీ కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీల్లో, వ్యాపార ఒప్పందాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. శారీరకంగా అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకం : ఈ రోజు మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడతాయి. అనవసర ఖర్చు పైన పడే అవకాశముంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.

సింహం

సింహం : ఈ రోజు మీ స్నేహితులతో లేదా మీజీవిత భాగ స్వామితో ఆనందంగా గడుపుతారు. రుచికరమైన ఆహారం, వినోద కార్యక్రమాలతో రోజంతా గడుపుతారు. అలాగే వాహనం కొనుగోలు కానీ, భూసంబంధ వ్యవహారాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

కన్య

కన్య : ఈ రోజు గృహసంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం, మరమ్మతులు చేయిం చడం కానీ చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అత్యుత్సాహానికి పోవడం వల్ల అనవసర ఖర్చులు పైనపడే అవకాశముంటుంది.

తుల

తుల : ఈ రోజు మీరు ఎంతో ఇష్టంతో, పట్టుదలతో చేపట్టిన పని అనుకోకుండా వాయిదా పడటం కానీ, అడ్డంకులు రావడం కానీ జరుగుతుంది. సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చడంతో మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు, పోటీలకు అనువైన రోజు కాదు. పిల్లలతో గడపడం వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

వృశ్చికం

వృశ్చికం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవ సరం. కడుపు నొప్పి, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవ కాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు :

మీ అజాగ్రత్త, అనాలోచిత ప్రవర్తన లేదా మాట కారణంగా మీ బంధువులతో వివాదం ఏర్పడే అవకాశమున్నది. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

మకరం

మకరం : ఈరోజు ఇతరులతో మాట్లాడేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. అలాగే ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చకండి. ఆ సమస్య మీకు చుట్టుకుంటుంది. మానసికంగా దృఢంగా ఉండటం మంచిది.

కుంభం :

కుంభం : స్నేహితులతో, పరిచయస్తులతో గడపడానికి అను వైన రోజు. వివాదాలు పరిష్కరించుకోవడానికి, సంబంధాలు మెరుగు పరచుకోవడానికి అనుకూలమైన దినం. అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి.

మీనం

మీనం : ఈ రోజు ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. అను కోని ఖర్చుల కారణంగా కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముం టుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, నగల విషయం లో జాగ్రత్త అవసరం. అజాగ్రత్తగా ఉండకండి. ఆవేశానికి లోను కాకుండా, ఓపికతో వ్యవహరించడం మంచిది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page